ఫిదా బ్యూటీ సాయి పల్లవి ఒకే రోజు రెండు సినిమాలతో రానుంది. తమిళంలో ధనుష్ సరసన సాయి పల్లవి నటించిన చిత్రం 'మారి 2' ఈ నెల 21న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాని తెలుగులో సాయి కృష్ణ పెండ్యాల విడుదల చేస్తున్నారు. కాగా ధనుష్ సినిమాలకు తెలుగులో పెద్దగా మార్కెట్ లేకపోయినా, సాయి పల్లవికి తెలుగులో ఉన్న క్రేజ్‌ని బట్టి ఈ సినిమా ఇక్కడ కూడా విజయవంతమయ్యే ఛాన్సెస్ ఉన్నాయని అంచనా వేస్తున్నారు. మరోవైపు తెలుగులో సాయి పల్లవి, శర్వానంద్ జంటగా తెరకెక్కుతోన్న 'పడి పడి లేచె మనసు' సినిమాపైనా అంచనాలు బాగున్నాయి.
ఈ వీక్ ఈ రెండు సినిమాలకు పోటీగా మరో మూడు సినిమాలు విడుదల కానున్నాయి. వాటిలో కన్నడ మూవీ 'కేజీఎఫ్' పై అంచనాలున్నాయి. ఇవన్నీ ఒకెత్తైతే, మెగా ప్రిన్స్ వరుణ్‌తేజ్ నటిస్తున్న 'అంతరిక్షం' సినిమా మరో ఎత్తు. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమా మరింత ఆశక్తిని రేకెత్తిస్తోంది. 'ఘాజీ' తో సబ్‌మెరీన్‌ని అంత లైవ్‌గా తెరపై చూపించిన డైరెక్టర్ సంకల్ప్‌రెడ్డి ఈ సినిమాలో అంతరిక్షాన్ని తనదైన శైలిలో ఎలా చూపించాడా.? అసలీ సినిమాకి కథేంటీ.? వరుణ్ తేజ్ పర్‌ఫామెన్స్ ఎలా ఉండబోతోంది.? ఇలా అనేక రకాలుగా ఆశక్తి నెలకొంది 'అంతరిక్షం' సినిమాపై.
ముఖ్యంగా డైరెక్ట్ తెలుగు సినిమాలైన 'పడి పడి లేచె మనసు', 'అంతరిక్షం' సినిమాలు పోరుకు తలపడనున్నాయి. ఆ తర్వాత అనువాద చిత్రాలైన 'కేజీఎఫ్', 'మారి 2' ల సత్తా ఏంటో చూడాలి. ఇదిలా ఉంటే బాలీవుడ్‌లో షారూఖ్‌ఖాన్ మరుగుజ్జు పాత్రలో నటిస్తున్న 'జీరో' చిత్రం కూడా ఇదే రోజు విడుదల కానుండడం విశేషం. ఇలా మొత్తంగా చూస్తే వివిధ భాషల్లో ఐదు సినిమాలు ఒకేరోజు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.
ALSO SEE : PADI PADI LECHE MANASU THEATRICAL TRAILER