'ముకుందా' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన మెగా హీరో వరుణ్‌తేజ్. తొలి సినిమాతోనే విషయమున్న హీరో అనిపించుకున్నాడు. ఆ తర్వాత 'కంచె' వంటి క్రిటికల్ సబ్జెక్ట్‌లో నటించి విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. మూడో సినిమా 'లోఫర్'తో మాస్ యాంగిల్ ట్రై చేసి ఓకే అనిపించుకున్నాడు.
కెరీర్‌లో వరుణ్ నటించిన 'మిస్టర్' డిజాస్టర్‌గా మిగిలింది. 'ఫిదా'తో తొలి సూపర్ డూపర్ హిట్ అందుకున్నాడు. 'తొలిప్రేమ'తో సెకండ్ సూపర్ హిట్‌ని తన ఖాతాలో వేసుకున్నాడు. తర్వాత వచ్చిన 'అంతరిక్షం' ఏవరేజ్ మూవీగా నిలిచింది. ఇక లేటెస్ట్ ది బెస్ట్ 'ఎఫ్ 2' కెరీర్ బెస్ట్ హిట్‌గా నిలిచింది వరుణ్‌తేజ్‌కి. ఇక సక్సెస్, ఫెయిల్యూర్ సంగతి అటుంచితే, సినిమా సినిమాకీ తనను తాను మార్చుకోవడంలో 100 పర్సెంట్ సక్సెస్ అయ్యాడు వరుణ్ తేజ్. ఒక్కో సినిమాకీ ఒక్కో రకమైన పాత్రతో తనను తాను మౌల్డ్ చేసుకున్నాడు.
మాస్ బ్రాండ్ ఉన్న మెగా కాంపౌండ్‌కి విలక్షణ హీరోగా నయా స్టాంప్ వేయించుకున్నాడు. ఇలా ఐదేళ్ల కెరీర్‌లో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తనలోని నటున్ని కొత్త కొత్తగా ఆవిష్కరిస్తూ వచ్చాడు. తక్కువ టైంలో స్టార్ హీరోగా ఎదిగాడు. ప్రస్తుతం 'వాల్మీకి' సినిమాలో నటిస్తున్నాడీ మెగాహీరో. హరీష్ శంకర్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది.