ఆశాషైనీ గుర్తుంది కదా? నరసింహనాయుడు లాంటి విజయవంతమైన చిత్రాల్లో నటించిన కథానాయిక. ఆమధ్య ఫ్లోరా షైనీగా పేరు మార్చుకొంది. కొన్ని హిందీ సినిమాలు, వెబ్ సిరీస్‌లూ చేసింది. ఇప్పుడు జీవితంలో స్థిరపడదామనుకొంటోంది. త్వరలోనే ఆశాషైనీ పెళ్లి చేసుకోబోతోంది. అయితే.. ఓ నిర్మాతపై ఆషా సంచనల వ్యాఖ్యలు చేసింది.
కెరీర్ మొదలైన కొత్తలో ఓ నిర్మాతని నమ్మి బాగా మోసపోయానని, తను తనని శారీరకంగా, మానసికంగా హింసించాడని, మెహంపై, ప్రైవేటు పార్ట్‌పై రక్తం వచ్చేలా కొట్టేవాడని... తన బాధని వెళ్లగక్కింది. తన హింస భరించలేక వదిలి వచ్చేశానని, ఆ తరవాత మళ్లీ జీవితంలో సెటిల్ అవ్వడానికి చాలా కాలం పట్టిందని ఆవేదన వ్యక్తం చేసింది. మొత్తానికి... ఫ్లోరా షైనీ జీవితం ఇప్పుడు బాగానే ఉంది. కాకపోతే ఆ నిర్మాత ఎవరో మాత్రం ఫ్లోరా చెప్పడం లేదు.
చిత్రసీమలో కథానాయికల్ని ఆట వస్తువులుగా భావిస్తారని చెప్పడానికి ఫ్లోరా జీవితమే నిదర్శనం. ఫ్లోరా షైనీ కామెంట్లు ఇప్పుడు బాగా వైరల్ అవుతున్నాయి. ఆ నిర్మాత ఎవరూ... అంటూ అందరూ ఆరా తీయడం మొదలెట్టారు. ఫ్లోరా నోరు విప్పితే గానీ ఆ నిర్మాత ఎవరో బయటకు తెలీదు.