విజయ్ దేవరకొండ - సమంత జంటగా `ఖుషి` అనే సినిమా రూపుదిద్దుకొంటున్న సంగతి తెలిసిందే. శివ నిర్వాణ దర్శకుడు. సగం షూటింగ్ అయిన తరవాత సినిమా అర్థాంతరంగా ఆగిపోయింది. దానికి కారణం సమంత అనారోగ్యమే. సమంత షూటింగులకు రాకపోవడం వల్ల ఈ సినిమా షెడ్యూళ్లన్నీ ఆగిపోయాయి. డిసెంబరులో విడుదల కావాల్సిన సినిమా ఇది. ఇప్పుడు దీని పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది. ఓ దశలో ఈ సినిమాని పూర్తిగా పక్కన పెడతారని, లేదంటే సమంత ని తీసేసి ఆమె సీన్లు రీషూట్ చేస్తారని ప్రచారం జరిగింది. మైత్రీ మూవీస్ కూడా... ఈ రెండు ఆప్షన్లలో ఒకటి ఎంచుకోవాలనుకొంది. దానికి తోడు... శివ నిర్వాణకి నాగచైతన్య డేట్లు ఇవ్వడంతో.. ఖుషి సినిమాపై నీలి మేఘాలు కమ్ముకొన్నాయి.
అయితే ఇప్పుడ ఈ సినిమాని సమంత కాపాడుకొంది. విషయం తెలిసిన సమంత వెంటనే దర్శక నిర్మాతలకు టచ్‌లోకి వెళ్లింది. తన వల్ల సినిమా ఆగిపోకూడదని, ఎంత కష్టమైనా డేట్లు ఇస్తానని దర్శక నిర్మాతలకు హామీ ఇచ్చిందట. మార్చి నుంచి సమంత కాల్షీట్లు ఇచ్చిందని, త్వరలోనే ఈ సినిమాని మొదలెట్టి, త్వరితగతిన పూర్తి చేయాలని శివ నిర్వాణ భావిస్తున్నాడ. సో... ఖుషి సినిమా ఆగిపోలేదు. సమంత.. ఈ సినిమాకి దూరం కాలేదు. సమంత నటించిన `శాకుంతలమ్` ఫిబ్రవరిలో ప్రేక్షకుల ముందుకు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రమోషన్లలోనూ సమంత పాలు పంచుకోనుంది.