గజల్స్ కి మారుపేరు అయిన గజల్ శ్రీనివాస్ కొద్దిసేపటి క్రితం అరెస్ట్ అయ్యాడు.
అందుతున్న సమాచారం ప్రకారం, రేడియో జాకీగా పనిచేస్తున్న ఓ మహిళ తనని గజల్ శ్రీనివాస్ లైంగింకంగా వేదిస్తున్నాడు అంటూ డిసెంబర్ 29న పంజాగుట్ట పోలిస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినట్టు తెలుస్తున్నది. అయితే తనని గత కొంతకాలంగా వేదిస్తున్నాడు అని అవి ఈ మధ్యకాలంలో మరింత పెరిగాయి అని ఆమె చేసిన ఫిర్యాదులో పేర్కొన్నదట.
దీనితో ఆయన పై కేసు నమోదు చేసిన పోలీసులు ఈరోజు ఉదయం ఆయనని అదుపులోకి తీసుకున్నారట. ఈ వార్త ఇప్పుడు సంచలనంగా మారింది. గొప్ప గొప్ప గజల్స్ పాడిన వాడిగా ఎంతో ఖ్యాతి గడించిన గజల్ శ్రీనివాస్ పై ఇటువంటి ఆరోపణలు రావడంతో అందరు ఒక్కసారిగా షాక్ అయ్యారు.
మరి ఈ అంశం పైన గజల్ శ్రీనివాస్ స్పందన తెలియాల్సివుంది అలాగే పోలీసులు కూడా ఈ కేసుకి సంబంధించి పూర్తీ వివరాలు ఇంకా విడుదల చేయలేదు.