అందాల భామ తాప్సీ ఏదో ఒక రకంగా వివాదాలను కోరి తెచ్చుకుంటోంది. బాలీవుడ్లో హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీస్‌తో బిజీ కావడంతో, టాలీవుడ్‌పై విమర్శలు గుప్పించింది. తనకు హీరోయిన్గా కెరీర్ ఇచ్చిన దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు పైనే విమర్శలు చేసి, నాలుక అడ్డంగా కరుచుకుని సారీ చెప్పింది. అలా కొన్నాళ్లు వార్తల్లో సెన్సేషన్ అయిన తాప్పీ. తర్వాత టాలీవుడ్‌కి రీ ఎంట్రీ ఇచ్చింది. లేటెస్ట్గా తాప్సీ నటించిన 'గేమ్ ఓవర్' చిత్రం బాక్సాఫీస్ వద్ద సో సోగా రన్ అవుతోంది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా తాప్సీ మరోసారి సంచలనమయ్యే ప్రయత్నం చేసింది. ఓ టాలీవుడ్ హీరోని టార్గెట్ చేసింది. ఈ మధ్య ఓ ప్రాజెక్ట్ తన వద్దకు వచ్చిందట.
కథ నచ్చడంతో సదరు యూనిట్ నుండి అడ్వాన్స్ కూడా తీసుకుందట తాప్సీ. అయితే, ఆ తర్వాత హీరో మార్కెట్‌ని దృష్టిలో పెట్టుకుని తాప్సీకి ముందు చెప్పిన రెమ్యునరేషన్‌ని తగ్గించుకోమని నిర్మాతలు కోరారట. దాంతో అగ్గి మీద గుగ్గిలమైన తాప్సీ సదరు నిర్మాతలకు ఫుల్‌గా క్లాస్ తీసుకుందట. తన రెమ్యునరేషన్ తగ్గించుకునే ప్రశక్తే లేదనీ, పేరు చెప్పలేదు కానీ, ఆ హీరో మార్కెట్‌తో తన రెమ్యునరేషన్‌కి సంబంధమేముందని సదరు నిర్మాతలకు చురకలు అంటించిందట. అయితే, ప్రాజెక్ట్ సెట్ చేసుకున్నప్పుడు మార్కెట్ ఉండి, తర్వాత మార్కెట్ తగ్గిపోయిన ఆ హీరో ఎవరై ఉంటారో చెప్మా అంటూ ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చ మొదలైంది. ఆ లిస్టులో కొందరి పేర్లు సోషల్ మీడియాలో సర్క్యులేట్ కూడా అవుతున్నాయి కానీ, మనమైనా ఎందుకు చర్చించుకోవాలిలెండి. నిజం నిలకడ మీదే తెలుస్తుంది. ప్రస్తుతం తాప్సీ బాలీవుడ్లో రెండు సినిమాల్లో నటిస్తోంది. తమిళంలో ఓ చిత్రం, తెలుగులో మరో చిత్రం ఓకే చేసింది. సో వివాదాలెలా ఉన్నా, తాప్సీ డైరీ మాత్రం ఫుల్‌గానే ఉందండోయ్.