బాల‌య్య‌కు నో చెప్పిన హాట్‌ భామ‌?

By iQlikMovies - June 18, 2019 - 09:30 AM IST

మరిన్ని వార్తలు

సినిమాల్లోకి అడుగుపెట్టిన కొత్త‌లోనే స్టార్ హీరోల‌తో న‌టించే అవ‌కాశం వ‌స్తే ఎవ్వ‌రూ వ‌దులుకోరు. చేతిలో ఉన్న సినిమాల్ని ప‌క్క‌న పెట్టైనా స‌రే, పారితోషికం త‌గ్గించుకునైనా స‌రే - అవకాశాల్ని అందిపుచ్చుకుంటారు. కానీ పాయ‌ల్ రాజ్ పుట్ మాత్రం కాస్త భిన్నంగా ఆలోచిస్తోంది. స్టార్ హీరోల సినిమా కోసం వెంప‌ర్లాడ‌డం లేదు. హీరో ఎవ‌ర‌న్న‌ది ప‌ట్టించుకోకుండా త‌న‌కొచ్చిన అవ‌కాశాల్ని చేసుకుంటూ పోతోంది. క‌థ న‌చ్చ‌క‌పోయినా, త‌న కాల్షీట్లు స‌ర్దుబాటు చేయ‌లేక‌పోయినా - సినిమాల్ని వ‌దులుకుంటోంది. ఇప్పుడు బాల‌కృష్ణ సినిమానీ అలానే వ‌దిలేసింద‌ట‌. నంద‌మూరి బాల‌కృష్ణ - కె.ఎస్‌.ర‌వికుమార్ కాంబినేష‌న్ లో ఓ సినిమా ఇటీవ‌లే క్లాప్ కొట్టుకుంది.

 

వ‌చ్చే నెల‌లో షూటింగ్ మొద‌ల‌వ్వ‌బోతోంది. ఇందులో క‌థానాయిక‌గా పాయ‌ల్ రాజ్‌పుట్‌ని ఎంచుకోవాల‌నుకున్నారు. ఈమేర పాయ‌ల్‌తో సంప్ర‌దింపులు కూడా జ‌రిగాయి. కానీ పాయ‌ల్ మాత్రం ఈ అవ‌కాశాన్ని వ‌దులుకుంది. త‌న కాల్షీట్లు స‌ర్దుబాటు అవ్వ‌డం లేద‌ని, అందుకే ఈ సినిమాలో న‌టించ‌లేక‌పోతున్నాన‌ని ద‌ర్శ‌క నిర్మాత‌ల‌కు చెప్పేసింద‌ట‌. సీనియ‌ర్ హీరోల‌తో ప‌నిచేయ‌డానికి ఈత‌రం క‌థానాయ‌కులు ఒక‌టికి రెండుసార్లు ఆలోచిస్తున్నార‌ని, పాయ‌ల్ కూడా అలా ఆలోచించే ఈ సినిమాని వ‌దులుకుంద‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS