మన తెలుగు సినిమాలు హిందీ లో డబ్ అయితే.. అక్కడుండే గిరాకీనే వేరు. హిందీలో సినిమాలకు కరువొచ్చిందో, లేదంటే... వాళ్లకు తెలుగు డబ్బింగులపై అంత ప్రేమో తెలీదు గానీ, మన దగ్గర్నుంచి వెళ్లిన ప్లాప్ సినిమాని సైతం.. గుడ్లప్పగించి చూసేస్తుంటారు. మిలియన్ వ్యూస్ కట్టబెడుతుంటారు. తాజాగా... మరో ఫ్లాప్ సినిమా ఈ ఘనత సాధించింది. అదే... గణేష్. రామ్ - కాజల్ జంటగా నటించిన సినిమా ఇది.
తెలుగులో ఫ్లాప్. ఇదే సినిమాని హిందీలో డబ్ చేసి వదిలితే... యూ ట్యూబ్‌లో వంద మిలియన్ల వ్యూస్ సంపాదించింది. రామ్ సినిమాకి ఇన్ని వ్యూస్ రావడం ఇదే తొలిసారి కాదు. ఇప్పటికి ఈ ఫీట్ ఆరు సార్లు సాధించాడు. టాలీవుడ్ లో ఏ హీరోకీ ఈ ఘనత దక్కలేదట. ఇటీవల ఇస్మార్ట్ శంకర్ హిందీ డబ్బింగ్ ని అక్కడ తెగ చూశారు. ఆ ఎఫెక్ట్.. రామ్ పాత సినిమాలపై కూడా పడింది. దాంతో రామ్ పాత సినిమాల్ని సెర్చ్ చేసి మరీ చూడడం మొదలెట్టారు. పైగా.. కరోనా కాలం కదా..? థియేటర్లు లేవు, కొత్త సినిమాలూ లేవు. అందుకే పాత సినిమాలకు ఇంత గిరాకీ మొదలైంది.