'గ్యాంగ్‌లీడర్' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ముద్దుగుమ్మ ప్రియాంకా అరుళ్ మోహన్. రిజల్ట్ పరంగా హిట్ కొట్టింది. యాక్టింగ్‌లోనూ ఓకే అనిపించుకుందీ బ్యూటీ. అవకాశాలు కూడా బాగానే రాబట్టుకుంటోంది. సో అదృష్టం కూడా బాగానే ఉన్నట్లే. ఇకపోతే, తాజాగా ఈ బ్యూటీ ఖాతాలో ఓ క్రేజీ ఆఫర్ పడ్డట్లు సమాచారం. విశ్వనటుడు కమల్‌హాసన్ నటిస్తున్న 'ఇండియన్ 2'లో ప్రియాంకా అరుళ్‌కి ఛాన్స్ దక్కిందట. ఈ సినిమాలో ఇప్పటికే కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్‌సింగ్ వంటి స్టార్ హీరోయిన్లు నటిస్తున్నారు. వారితో పాటు, ఐశ్వర్యా రాజేష్ కూడా ఓ కీలక పాత్రలో నటించాల్సి ఉంది.
అయితే, ఆమె ప్రస్తుతం కోలీవుడ్‌లోనూ, టాలీవుడ్‌లోనూ బిజీ ప్రాజెక్టులతో గడుపుతున్న కారణంగా ఈ సినిమాకి డేట్స్ కేటాయించలేకపోతోందట. దాంతో ఈ సినిమా నుండి ఐశ్వర్యా తప్పుకున్నదనే సమాచారం ఉంది. ఆ ప్లేస్‌లోకే ఈ కొత్త భామ ప్రియాంకా ఇన్ అయినట్లు తెలుస్తోంది. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా, అందులోనూ కెరీర్ మొదట్లోనే విశ్వనటుడు కమల్ హాసన్ సినిమాలో నటించే ఛాన్స్ రావడంతో అమ్మడు ఆనందానికి అవధుల్లేవట. ఇకపోతే తెలుగులో ఈ భామ శర్వానంద్ హీరోగా 'శ్రీకారం' సినిమాలో నటిస్తోంది. అలాగే తెలుగు, తమిళ భాషల్లో మరిన్ని కథలు ఫైనల్ స్టేజ్‌లో చర్చల దశలో ఉన్నాయట. సో ఈ ప్రియాంకకు టాలెంట్ బాగానే కలసొచ్చినట్లే.