నానితో సినిమా అంటే విడుదలకు ముందే నిర్మాతలు రిలాక్స్ అయిపోవొచ్చు. ఎందుకంటే.. టేబుల్ ప్రాఫిట్‌కి సినిమా అమ్ముకోవచ్చు. మినిమం గ్యారెంటీ అన్నమాట. నాని సినిమాలన్నీ ఇలానే విడుదలకు ముందే సేఫ్ అయిపోయాయి. ఇప్పుడు గ్యాంగ్ లీడర్ పరిస్థితి కూడా అంతే. నాని - విక్రమ్ కె.కుమార్‌కాంబినేషన్‌లో రూపుదిద్దుకున్న చిత్రమిది. కార్తికేయ విలన్‌గా ఎంట్రీ ఇస్తున్నాడు. ఈవారమే విడుదల కాబోతోంది. విడుదలకు ముందే... ఈ సినిమా సేఫ్ జోన్‌లో పడిపోయింది.
దాదాపు 28 కోట్లకు బిజినెస్ జరిగిపోయింది. ఇవి కాకుండా శాటిలైట్, డిజిటల్ రైట్స్ అదనం. నైజాంలో ఈ సినిమాకి 8 కోట్లు వచ్చాయి. నాని కెరీర్‌లో ఇది అత్యధిక ధర. ఓవర్సీస్‌లో 5.5 కోట్లు వచ్చాయి. సీడెడ్‌లో 3.6, ఉత్తరాంధ్రలో 2.5 కోట్లు దక్కాయి. చాలా చోట్ల నాని గత సినిమాల రేటుని దాటేసింది. అదంతా విక్రమ్ కె.కుమార్ చలవే. అయితే ఇక్కడో ముప్పు ఉంది. విక్రమ్ సినిమాలు క్లాస్‌కి బాగా నచ్చుతాయి. మాస్‌కి దగ్గరైన సినిమాలు చాలా తక్కువ. గ్యాంగ్ లీడర్ టైటిల్, నాని, కార్తికేయ ఇదంతా మాస్ వ్యవహారం. మరి.. విక్రమ్ మాస్‌నీ, తన క్లాస్‌నీ ఎలా మిక్స్ చేశాడో..?