బిగ్‌బాస్ స్టార్టింగ్ నుండీ పునర్నవి, రాహుల్, వరుణ్, వితికలు ఓ గ్రూప్‌గా ఉంటూ వస్తున్నారు. వరుణ్, వితికలు ఎలాగూ ఆఫీషియల్ జోడీ. రాహుల్, పునర్నవి మధ్య సమ్‌థింగ్ సమ్‌థింగ్ అన్నట్లుగా ప్రొజెక్ట్ అవుతూ వచ్చింది. అయితే, తాజా ఎపిసోడ్‌లో ఈ గ్రూప్ మధ్య బ్రేకప్ వచ్చినట్లు కనిపించింది. పునర్నవిని ఒంటరిని చేసేసినట్లు అర్ధమవుతోంది. రాహుల్, పునర్నవి మధ్య సమ్‌థింగ్ సమ్‌థింగ్‌లాంటివి ఏమీ లేవని అర్ధమైపోయింది.
ఆల్రెడీ పునర్నవి వేరే వ్యక్తితో లవ్‌లో ఉన్నట్లుగా వీకెండ్ ఎపిసోడ్‌లో నాగార్జున సమక్షంలో ప్రూవ్ అయిపోయింది. సో రాహుల్, పునర్నవి జస్ట్ ఫ్రెండ్స్ అండ్ ఓన్లీ హౌస్ మేట్స్ అంతే. ఇక తాజా ఎపిసోడ్ విషయానికి వస్తే, పునర్నవి ఒంటరిగా ఫీలవుతూ, మహేష్ వద్ద కన్నీరు మున్నీరైంది. తన కోపాన్ని ఎవరైతే కంట్రోల్ చేయగలరో ఆ ముగ్గురూ నాకు ఇప్పుడు లేరు.. అని చెప్పింది.
అంటే వరుణ్, వితిక, రాహుల్.. పునర్నవిని వదిలేశారా? నిజానికి వారందరినీ పునర్నవి జెన్యూన్‌గా అభిమానించింది. వరుణ్, వితికల సంగతి పక్కన పెడితే, రాహుల్ కూడా పునర్నవిని అలాగే అభిమానించాడు. కానీ, ఈ గ్యాప్‌లో బిగ్ హౌస్‌లో ఏం జరిగింది? ముచ్చటగా కనిపించే ఈ గ్రూప్ మధ్య ఎందుకిలా గొడవలు చెలరేగాయి? వీరి బ్రేకప్‌కి హౌస్‌లో కారణమెవరు? తెలియాలంటే స్టే ట్యూన్డ్ ఫర్ బిగ్ బాస్ న్యూస్.