కథలు చేతులు మారడం.. ఇండ్రస్ట్రీలో చాలా సాధారణమైన విషయం. కానీ అది అత్యంత సెన్సిటీవ్ సంగతి. ముఖ్యంగా పెద్ద హీరోల విషయంలో ఇలా జరిగితే... ఈగోలు దారుణంగా హర్టయిపోతాయి. అందులోనూ... అఫీషియల్ ఎనౌన్స్‌మెంట్ వచ్చాక, ఆ సినిమా ఆపేస్తే - ఇంకా దారుణంగా మనోభావాలు దెబ్బతింటారు. ఎన్టీఆర్ - త్రివిక్రమ్ సినిమా ఆగిపోవడం, ఆ సినిమా చేతులు మారడం - చాలామందిని హర్ట్ చేసింది. హర్ట్ చేస్తూనే ఉంది.
ఎన్టీఆర్ - త్రివిక్రమ్ కాంబోలో ఓ సినిమా సెట్టవ్వడం, అది ఇప్పుడు ఆగిపోవడం చర్విత చరణమే. కానీ.. ఈ ఒక్క సినిమా వెనుక.. చాలామంది హర్టయ్యారు. అందులో ఎన్టీఆర్ ఒకడు. త్రివిక్రమ్ తో సినిమా ఫైనల్ చేసేశాక.. కథేమిటన్నది కూడా అడక్కుండా, త్రివిక్రమ్ ని గుడ్డిగా ఫాలో అయిపోయాడన్నది ఎన్టీఆర్ సన్నిహితుల మాట. అయితే ఇప్పుడు ఎన్టీఆర్ - త్రివిక్రమ్ మధ్య ఆ కథ విషయంలోనే చిన్న పాటి కమ్యునికేషన్ గ్యాప్ వచ్చి... `ఈ ప్రాజెక్టు వద్దు` అనుకున్నారు. ఎప్పుడైతే అలా అనుకున్నారో.. అప్పటి నుంచీ ఇప్పటి వరకూ ఎన్టీఆర్ - త్రివిక్రమ్ మధ్య మాటల్లేవన్నది ఇండ్రస్ట్రీ వర్గాల టాక్.
ఇప్పుడు అల్లు అర్జున్ - కొరటాల శివ మధ్య కూడా ఆ కమ్యునికేషన్ తెగిపోయే ప్రమాదం వచ్చిందన్నది ఫిల్మ్‌నగర్‌లో వినిపిస్తున్న వార్త. `పుష్ష` తరవాత... కొరటాల శివ సినిమాకి ఓకే చెప్పాడు బన్నీ. ఓ కాన్సెప్ట్ పోస్టర్ నీ విడుదల చేశారు. ఇప్పుడు బన్నీతో సినిమా చేయాల్సిన సమయంలోనే.. ఎన్టీఆర్ తో సినిమా కుదుర్చుకున్నాడు బన్నీ. ఇదంతా బన్నీ అంగీకారంతో జరిగిన విషయమే. కాకపోతే... బన్నీ .. కొరటాలకు కమిట్ అయిపోయాడు. `కొరటాల సినిమా ఉందిలే` అని మిగిలిన కథల్ని పక్కన పెట్టాడు. ఇప్పుడు కొరటాల స్థానంలో మరో సినిమా ఓకే చేయడం బన్నీకి సమస్య కాదు. కాకపోతే... చాలా సెన్సిటీవ్ వ్యవహారం ఇది. తనతో సినిమా ఓకే చేయించుకుని, మరో హీరోకి కమిట్ అయిపోవడం బన్నీకి నచ్చడం లేదని టాక్. ఈ విషయం పై కొరటాలని బన్నీ ఫ్యాన్స్ ట్రోల్ చేయడం కూడా మొదలెట్టేశారు.
హీరోల మధ్య స్నేహపూర్వకమైన వాతావరణం `పైకి` అందంగా కనిపిస్తున్నా, లోలోపల చిన్న చిన్న ఈగోలు ఉంటాయి. ఇప్పుడు బన్నీ, ఎన్టీఆర్, మహేష్‌ల మధ్య ఆ వాతావరణం.. కాస్త దెబ్బ తినే ప్రమాదం కనిపిస్తోంది. ఇదంతా.. ఒక్క సినిమా చేతులు మారడం వల్ల. భవిష్యత్తులో ఎన్టీఆర్ - త్రివిక్రమ్, అల్లు అర్జున్ - కొరటాల.. మళ్లీ కలిసి, సినిమా చేసేంత వరకూ ఈ గ్యాప్ అన్నది కొనసాగుతూనే ఉంటుంది.