కోవిడ్ ఉధృతిని కారణంగా చూపించి.. పెద్ద సినిమాలన్నీ వాయిదా పడుతున్నాయి. ఓరకంగా... సమ్మర్ పై ఆశలు పెట్టుకున్న టాలీవుడ్ కి ఇది అతి పెద్ద షాక్. ఆచార్య, పుష్ష లాంటి పెద్ద సినిమాలు వాయిదా పడుతుండడంతో.. టాలీవుడ్ కళ తప్పింది. 2020లోని పరిస్థితులే మళ్లీ పునరావృతం అవ్వబోతున్నాయా? అనే భయాలూ నెలకున్నాయి. ఈ వేసవి సినిమాలతో పాటు `ఆర్.ఆర్.ఆర్` కూడా వాయిదా పడబోతోందన్న టాక్ వినిపిస్తోంది. అక్టోబరు 13న రావాల్సిన సినిమా ఇది. ఇది కాస్త.. మరో నెల వెనక్కి వెళ్లే ఛాన్సుందన్నది వార్తల సారాంశం.
అయితే... రాజమౌళి మాత్రం ఎట్టిపరిస్థితుల్లోనూ ఈ సినిమాని అక్టోబరు 13నే తీసుకురావాలని ఫిక్స్ అయ్యాడట. ఇది పాన్ ఇండియా సినిమా. ఓ డేట్ అనుకుని, ఆ సమయానికి రాకపోతే... చాలా ఇబ్బందులు ఎదురవుతాయి. పైగా ఆర్.ఆర్.ఆర్ ఇప్పటికే పలుమార్లు వాయిదా పడింది. చెప్పిన సమయానికి సినిమాని తీసుకురాడు.. అనే అపవాదుని చెరిపేసుకోవడానికి రాజమౌళి ఎన్నో ఏళ్లుగా కష్టపడుతూనే ఉన్నాడు. ఈసారీ అదే కామెంట్ వినిపిస్తే బాగోదన్నది... తన ఆలోచన. అందుకే కోవిడ్ మరీ భయంకరంగా మారిపోయి, అన్ని సినిమాల రిలీజ్ డేట్స్ లో తేడా వస్తే తప్ప... ఆర్.ఆర్.ఆర్ రిలీజ్ డేట్ మార్చేది లేదన్నది.. ఆయన మాట.