ఇంతకు ముందెన్నడూ లేని విధంగా రాజశేఖర్ సినిమాలకు వినిపించని టాక్ 'గరుడవేగ' సినిమాకి వినిపిస్తోంది. ట్రైలర్ విడుదలయ్యాక అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. ట్రైలర్‌లో యాక్షన్ సీక్వెన్సెస్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, ఇతర టెక్నికల్ అంశాలు అందర్నీ విశేషంగా ఎట్రాక్ట్ చేస్తున్నాయి. ట్రైలర్ చూస్తుంటే హాలీవుడ్ ట్రైలర్‌ని తలపించేలా ఉంది. సినీ ప్రముఖులంతా ఇప్పుడు ఈ ట్రైలర్ గురించే మాట్లాడుకుంటున్నారు. దీనికి సంబంధించిన టోటల్ క్రెడిట్ అంతా డైరెక్టర్ ప్రవీణ్ సత్తారుకే దక్కుతుంది. గతంలో 'చందమామ కథలు', గుంటూర్ టాకీస్' వంటి చిన్న సినిమాలను తెరకెక్కించిన అనుభవం మాత్రమే ప్రవీణ్ సత్తారుకుంది. కానీ ఈ ట్రైలర్ వచ్చిన తర్వాత పెద్ద నిర్మాతలు కూడా డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు గురించి వాకబ్ చేస్తున్నారట. తెలుగులోనే కాదు, తమిళ సినీ రంగం నుండి కూడా ప్రవీణ్ సత్తారు టాలెంట్‌ని మెచ్చుకుంటూ ఆయన గురించి వివరాలు కనుక్కునే ప్రయత్నాలు జరుగుతున్నాయనీ సమాచారమ్. అంతగా ఈ ఒక్క ట్రైలర్‌తో మొత్తం ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షించేశాడు ప్రవీణ్ సత్తారు. రాజశేఖర్ గతంలో చాలా యాక్షన్ సినిమాల్లో నటించారు. కానీ విడుదలకి ముందే 'గరుడవేగ' సినిమాకి వచ్చినంత హైప్ ఇంతకు ముందు ఆయన నటించిన ఏ సినిమాకీ రాకపోవడం విశేషం. ఈ సినిమాతో రాజశేఖర్ ఈజ్ బ్యాక్ అనే అనిపిస్తోంది. అంతేకాదు రాజశేఖర్ కేవలం హీరోగానే కాకుండా డిఫరెంట్ క్యారెక్టర్స్ చేయడానికి కూడా సుముఖంగా ఉన్నట్లు తెలియవస్తోంది. నెగిటివ్ రోల్స్‌లో నటించేందుకు ఆయన ట్రై చేస్తున్నారట. ఇప్పటికే బాలయ్య దగ్గర రాజశేఖర్ మాట తీసుకున్నట్లు సమాచారమ్. ఆయన సినిమాలో విలన్‌గా ఛాన్స్ వస్తే నటించడానికి రాజశేఖర్ ఈ క్షణం రెడీగా ఉన్నారట.