అంచనాలకు తగ్గట్లుగానే బాలకృష్ణ వందో చిత్రంగా తెరకెక్కిన 'గౌతమీ పుత్ర శాతకర్ణి' సినిమాకి మంచి రెస్పాన్స్ వస్తోంది. మొత్తమ్మీద ఈ సినిమాకి 1.5మిలియన్స్‌దాకా కలెక్షన్స్ రావచ్చునని అంచనా. అయితే ఈ లెక్క ఇంకా దాటినా ఆశ్చర్యపోనక్కర్లేదు. విదేశాల్లో కూడా ఈ సినిమాకి మంచి రెస్పాన్స్ వస్తోంది. అక్కడ ఉన్న తెలుగు వారు ఈ సినిమాని చూడడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ప్రపంచంలో ఎక్కడున్న తెలుగువారైనా తెలుగు చరిత్రని తెలుసుకోవడానికి ఈ సినిమా ఎంతగానో ఉపయోగపడుతుందని భావిస్తున్నారంతా. బాలకృష్ణకి ఉన్న మాస్ ఇమేజ్‌తో కేవలం ఇండియాలోనే ఈ సినిమా నిలదొక్కుకోగలదని భావించారంతా.కానీ విదేశాల నుండి కూడా ఈ సినిమాకు వస్తోన్న రెస్పాన్స్‌తో అంతా ఆశ్చర్యపోతున్నారు. బాలకృష్ణ వందో చిత్రాన్ని ఎంతో ప్రతిష్ఠాత్మకంగా రూపొందించాలనే క్రిష్ ప్రయత్నం ఫలించింది ఈ సినిమాతో. ఓ స్టార్ హీరోని తన ఇమేజ్‌కి తగ్గట్లుగా తన టాలెంట్‌తో ఇంత అద్భుతంగా తెరపై ఆవిష్కరించాడు క్రిష్. చరిత్రని టచ్ చేయడమంటే చిన్న విషయం కాదు. అలాంటి క్రిటికల్ సబ్జెక్ట్ అయిన 'శాతకర్ణి'ని అతి తక్కువ టైంలోనే తెరకెక్కించాడు క్రిష్. ఈ సినిమాలో నటించిన ప్రతీ ఒక్కరికీ అరుదైన గౌరవం దక్కింది. గ్లామర్ పాత్రలతో ఎంతో మంచి పేరు తెచ్చుకున్న శ్రియ మొదటిసారిగా ఇలాంటి చారిత్రక నేపధ్యం ఉన్న సినిమాలో నటించింది. ఆ పాత్రకు ఆమె సరైన న్యాయం చేసిందనే చెప్పాలి. అలాగే బాలీవుడ్ నటి హేమామాలిని కూడా. టోటల్‌గా బాలకృష్ణకి వందో చిత్రం 'శాతకర్ణి' రూపంలో ఒక అద్భుతమైన జ్ఞాపకంగా మిగిలిపోతుంది.