గాడ్ ఆఫ్ మాసెస్ బాలయ్య యంగ్ హీరోల కంటే జోరు మీదున్నాడు. వరస ప్రాజెక్ట్ లు చేస్తూ దసరా, సంక్రాతి, సమ్మర్ లకి కర్చీఫ్ వేసేస్తున్నాడు. 'అఖండ', 'వీర సింహా రెడ్డి', 'భగవంత్ కేసరి'తో హ్యాట్రిక్ హిట్లతో దూసుకుపోతున్న బాలయ్య ఇప్పుడు తన 109వ చిత్రాన్ని బాబీతో చేస్తున్నారు. ఈ చిత్రం 1980 ల నాటి కథతో రూపొందబోతున్నట్లు తెలుస్తోంది. డిఫరెంట్ సబ్జెక్ట్ తో, బాలయ్య మార్కును జోడించి రూపొందుతోన్న ఈ సినిమా రెగ్యూలర్ షూటింగ్ జరుగుతోంది. ఇందులో యాక్షన్ సీక్వెన్స్ షూట్ చేశారు. రాజస్థాన్ లో కొన్ని ప్రాంతాల్లో చిత్రీకరణ జరిపినట్టు సమాచారం.
సౌత్ సినిమాల్లో హీరోతో సమప్రాధ్యానత ఉండే పాత్ర విలన్ ది. హీరో ఎవరన్న చర్చతో పాటు విలన్ గూర్చి కూడా అంతా ఆసక్తిగా చూస్తున్నారు. ఇప్పుడు కూడా బాలయ్య సినిమాలో ఎవరనే చర్చ జరుగుతున్న నేపథ్యంలో లేటెస్ట్ అప్డేట్ ఒకటి వచ్చింది. యానిమల్ తో గుర్తింపు పొందిన బాలీవుడ్ స్టార్ హీరో బాబీ డియోల్ ఆ పాత్రను చేస్తున్నట్లు చిత్ర యూనిట్ క్లారిటీ ఇచ్చేసింది. అయితే ఈ మూవీలో మరో విలన్ కూడా ఉన్నట్లు తాజాగా ఓ న్యూస్ ఫిలిం నగర్‌లో వైరల్ అవుతోంది.
బాలయ్య సినిమాలో మరో విలన్ పాత్ర కోసం కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ్ మీనన్‌ను సంప్రదించినట్లు, ఆయన ఓకే చెప్పారని ఓ న్యూస్ లీకైంది. మెయిన్ విలన్‌గా బాబిడియోల్, సెకండ్ విలన్ గా గౌతమ్ మీనన్ చేస్తున్నారని కన్ఫర్మ్ అయ్యింది. బాలయ్య - గౌతమ్ మీనన్ మధ్యన వచ్చే సన్నివేశాలు సినిమాకు హైలైట్‌గా ఉండబోతున్నాయని తెలిసింది. పూర్తి స్థాయి డిఫరెంట్ యాక్షన్‌తో రూపొందుతోన్న ఈ సినిమాను సితారా ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చన్ ఫోర్ సినిమాస్, శ్రీకర స్టూడియోస్ బ్యానర్లపై సాయి సౌజన్య, నాగ వంశీ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇందులో శ్రద్దా శ్రీనాథ్, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.