కమల్ హాసన్ రాజకీయ ఆరంగేట్రం తరువాత ఆయన వ్యక్తిగత జీవితానికి సంబంధించి కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు ఆయన మాజీ సహచరి నటి గౌతమి.
అయితే ఆయన రాజకీయాల్లోకి వచ్చాక ఇటువంటి వ్యాఖ్యలు రావడంతో ఇప్పుడు అవి వివాదాస్పదంగా మారాయి. ఆ వివరాల్లోకి వెళితే, కమల్ హాసన్ నిర్మాణ సంస్థ అయిన రాజ్ కమల్ ఇంటర్నేషనల్ ఫిలిమ్స్ కి సంబంధించి నిర్మించిన చిత్రాలకి తాను కాస్ట్యూమ్ డిజైనర్ గా పని చేశాను అని దానికి సంబంధించి తనకి చెల్లింపులు జరగలేదు అని తెలిపింది.
సదరు చెల్లింపుల కోసం చాలా కాలం నుండి ఎదురు చూసాకనే తాను ఇప్పుడు వ్యాఖ్యలు చేస్తున్నట్టుగా తెలిపారు. ఇదే సమయంలో కమల్ హాసన్ అమ్మాయిల వల్ల తాము విడిపోయాము అన్నది ఎంత మాత్రం నిజం కాదు.
మొత్తానికి కమల్ హాసన్ తో విడిపోయిన తరువాత ఆమె అయన పైన చేస్తున్న వ్యాఖ్యలు వివాదాస్పదమవుతున్నాయి.