సినిమానే ఆమె కెరీర్‌గా ఎంచుకుంది. గ్లామర్ ప్రపంచంలో ధృవతారగా ఎదిగే క్రమంలో ఆమె తన ముక్కుకు సర్జరీ చేయించుకున్న సంగతి తెలిసిందే. అయితే ఆ సర్జరీనే ఇప్పుడు ఆమె ప్రాణం కోల్పోయేలా చేసిందంటూ ఊహాగానాలు వినిపిస్తున్నాయి. గ్లామర్ ప్రపంచంలో అందాల తారగా ఎందరో అభిమానుల అభిమానాన్ని చూరగొన్న శ్రీదేవి ఆ రంగంలో మరింత ముందుకు వెళ్లేందుకు, అభిమానుల్ని మరింతగా అలరించే క్రమంలో ఆమె ఎన్నో రిస్క్‌లు భరించారు.
అయితే అలా తన అందాన్ని కాపాడుకునే క్రమంలో ఆయా బ్యూటీ రిస్క్‌ల కారణంగానే ఆమె మరణించిందంటూ పలు టీవీ ఛానెల్స్‌లో చర్చా కార్యక్రమాలు జరుగుతున్నాయి. అలాగే సోషల్ మీడియా వేదికగా ఆమె ఆకస్మిక డెత్ విషయమై పలు దుష్ప్రచారాలు జరుగుతున్నాయి. బరువు తగ్గేందుకు రకరకాల సర్జరీలు అందుబాటులో ఉన్నాయి. అందులో ప్రధానమైనది 'లైపోసెక్షన్'. ఈ సర్జరీ కొంతవరకూ రిస్కీనే. అలాగే బేరియాట్రిక్ సర్జరీ వంటి ఇతరత్రా రకరకాల సర్జరీలు కూడా అందుబాటులో ఉన్నాయి. వీటిని సెలబ్రిటీసే కాదు, మామూలు సాధారణ మిడిల్ క్లాస్ పీపుల్ కూడా ఫాలో అవుతున్నారు. అయితే సర్జరీ చేయించుకోవడం అంటే ఆషామాషీ కాదు. అలా చేయించుకునే వారు కూడా ఆ విషయాన్ని అంత తేలిగ్గా తీసుకోరు. తగు జాగ్రత్తలు తీసుకున్నాకే ఇలాంటి సర్జరీలకు ముందుకొస్తారు.
ఎంతైనా ఎవరి ఆరోగ్యం పట్ల వారికి శ్రద్ధ ఉంటుంది కదా. అయితే ఇక్కడ శ్రీదేవి విషయానికి వస్తే, ఈ కాస్మోటిక్ సర్జరీల కారణంగానే ఆమె మరణించిందంటూ ప్రచారం చేయడం ఎంతవరకూ సబబు? గ్లామర్ ప్రపంచంలో ఓ వెలుగు వెలిగి, ఎంతగానో పేరు, ప్రఖ్యాతలు తెచ్చుకున్న ఆమెను ఇలాంటి చర్చావేదికల ద్వారా అవమానించొద్దు ప్లీజ్ అంటూ ఆమె సన్నిహితులు, కుటుంబ సభ్యులు, అభిమానులు కోరుకుంటున్నారు.