సెన్సార్ పూర్తిచేసుకున్న మోహన్ బాబు 'గాయత్రి'

మరిన్ని వార్తలు

డా. మోహన్ బాబు ప్రధాన పాత్ర లో నటిస్తున్న 'గాయత్రి' చిత్రం సెన్సర్స్ కార్యక్రమాలు పూర్తిచేసుకొని ఫిబ్రవరి 9 న భారీ విడుదలకు సిద్ధంగా ఉంది. ఇటీవలే విడుదలైన ట్రైలర్ కు అద్భుత స్పందన వస్తుంది.  గాయత్రి చిత్రానికి సెన్సార్ U/A సర్టిఫికెట్ ఇచ్చింది.

మోహన్ బాబు ఇంటెన్స్ లుక్ మరియు పవర్ఫుల్ డైలాగులతో కూడిన ట్రైలర్ చిత్రంపై ఆసక్తిని భారీగా పెంచేసాయి. ఎస్ తమన్ స్వరపరిచిన చిత్ర పాటలకు విశేష స్పందన వస్తుంది. గాయత్రిలో విష్ణు మంచు ఓ పవర్ ఫుల్ పాత్రలో కనిపించనుండటం చిత్రానికి మరో హైలైట్. శ్రియ ఆయన సరసన జంటగా మొదటిసారి నటించారు.

మదన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నిఖిల విమల్, అనసూయ భరద్వాజ్, బ్రహ్మానందం ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS