నందమూరి నటసింహం బాలకృష్ణ గత కొన్నిరోజులుగా తీవ్రమైన భుజం నొప్పితో బాధపడుతున్నారు. ఇటీవల బాలకృష్ణ నటించిన జై సింహా చిత్రం విడుదలయింది. ఈ సినిమా షూటింగ్ సమయంలో నొప్పి ఎక్కువగా ఉన్నా వాయిదా వేసే పరిస్థితి లేక కంటిన్యూ చేయటం జరిగింది.
ప్రస్తుతం బాలయ్య తన తండ్రి జీవిత చరిత్ర ఆధారంగా తీస్తున్న ఎన్టీఆర్ బయోపిక్ లో నటిస్తున్నాడు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కావటానికి టైం పట్టడంతో తన భుజం నొప్పికి సంబంధించిన సర్జరీ అమెరికా లో చేయించుకోవడానికి సిద్ధమయినట్టు తెలుస్తుంది.
సర్జరీ తరువాత దాదాపు కొన్ని రోజులు విశ్రాంతి తీసుకోవలసి ఉంటుంది. అందుకే బాలయ్య సర్జరీ తరువాత కొన్ని రోజులు షూటింగ్ లకి దూరంగా ఉండబోతున్నాడు. ఈ గ్యాప్ లో ఎన్టీఆర్ స్క్రిప్ట్ ని పూర్తి చేయాలని చూస్తున్నాడు. మొదటిసారి ఇంత గ్యాప్ తీసుకోవడంతో బాలయ్య ఫాన్స్ నిరుత్సాహంతో ఉన్నారు.