విజయ్‌ 50 కోట్లు కొల్లగొట్టగలడా?

మరిన్ని వార్తలు

పరుగులు పెడ్తున్నాడు, చాలా వేగంగా! ఇంకెవరో కాదు, అనూహ్యంగా స్టార్‌డమ్‌ సంపాదించుకున్న ఆ యంగ్‌ హీరో విజయ్‌ దేవరకొండ. ఔను, 'అర్జున్‌రెడ్డి' సినిమాతో బంపర్‌ విక్టరీ కొట్టి తెలుగు సినిమా పరిశ్రమలో అందర్నీ ఆశ్చర్యపరిచిన విజయ్‌ దేవరకొండ లేటెస్ట్‌గా 'గీత గోవిందం' సినిమాతో మరో సూపర్‌ హిట్‌ అందుకున్నాడు. 

ఈ సినిమా ఆల్రెడీ 30 కోట్ల క్లబ్‌లోకి చేరిపోయింది. 40 కోట్ల దిశగా పరుగులు పెడ్తోంది. రేపటికే ఈ మార్క్‌ అందుకునే అవకాశం ఉంది. ఈ వీకెండ్‌ పూర్తయ్యేసరికి 50 కోట్లకు చేరువగా 'గీత గోవిందం' వసూళ్ళు వుంటాయని ట్రేడ్‌ పండితులు అంచనా వేస్తున్నారు. సినిమా విడుదలయ్యాక సూపర్‌ హిట్‌ టాక్‌ రావడం, మరో సినిమా ఏదీ మధ్యలో రిలీజ్‌ కాకపోవడంతో 'గీత గోవిందం' సినిమా వసూళ్ళకు ఆకాశమే హద్దుగా మారింది. 

చాలామంది యంగ్‌ హీరోలకు 50 కోట్ల మార్క్‌ అనేది ఓ డ్రీమ్‌గానే మిగిలిపోయింది. అలాంటిది తక్కువ సినిమాలతోనే విజయ్‌ దేవరకొండ ఈ ఫీట్‌ సాధించినట్లయ్యింది. అన్ని వర్గాల ప్రేక్షకుల్ని అలరించే సూపర్‌ ఎంటర్‌టైనర్‌గా 'గీత గోవిందం' చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు పరశురామ్‌, ఈ సినిమాలో తనదైన నటనతో మెప్పించిన రష్మిక మండన్న ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్‌ ప్రాపర్టీస్‌గా మారారు. టాలీవుడ్‌లో ఓ బిగ్‌ స్టార్‌తో సినిమా చేసే అవకాశం పరశురామ్‌కి దక్కగా, రష్మిక స్టార్‌ హీరోయిన్ల లీగ్‌లోకి చేరిపోయిందంటున్నారు సినీ పండితులు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS