'సైరా'కి అడిషనల్‌ 'పవర్‌' అందిస్తాడా.?

మరిన్ని వార్తలు

12 మిలియన్‌ వ్యూస్‌ దాటేసింది 'సైరా నరసింహారెడ్డి' టీజర్‌. మెగాస్టార్‌ చిరంజీవి హీరోగా రూపొందుతోన్న ఈ చిత్రాన్ని మెగా పవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌, కొణిదెల ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై నిర్మిస్తున్న సంగతి తెల్సిందే. 'ధృవ' ఫేం సురేందర్‌రెడ్డి ఈ చిత్రానికి దర్శకుడు. 

అత్యంత ప్రతిష్టాత్మకంగా, భారీ బడ్జెట్‌తో రూపొందుతోన్న 'సైరా' సినిమాకి చాలా ఆకర్షణలే వున్నాయి. చిరంజీవి హీరోగా నటిస్తున్న చారిత్రక నేపథ్యమున్న సినిమా, దానికి తోడు.. బాలీవుడ్‌ మెగాస్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌ నటిస్తుండడం.. ఇలా చాలా ప్రత్యేకతలతో 'సైరా' ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. తమిళ నటుడు విజయ్‌ సేతుపతి, అందాల భామ నయనతార, మిల్కీ బ్యూటీ తమన్నా.. ఇలా చెప్పుకుంటూ పోతే 'సైరా'లో స్టార్‌ కాస్టింగ్‌ అదరహో అన్నట్లుంది. 

ఇదిలా వుంటే, 'సైరా నరసింహారెడ్డి' టీజర్‌ని మొట్టమొదటగా పవన్‌కళ్యాణ్‌ చూశాడట. చరణ్‌, తన బాబాయ్‌కి 'సైరా' టీజర్‌ని చూపించడం, టీజర్‌ అదిరిపోయిందంటూ నిర్మాత చరణ్‌కి పవన్‌ చెప్పడం జరిగిపోయాయి. మరోపక్క పవన్‌కళ్యాణ్‌, తన అన్నయ్య చిరంజీవికి స్వయంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపినట్లు సమాచారం. ఈ సందర్భంగా 'సైరా' సినిమా కోసం పవన్‌, తనవంతుగా ఓ చిన్న 'సాయం' చేసేందుకు ఓకే చెప్పాడట. 

అదేంటంటే, 'సైరా' సినిమాకి వాయిస్‌ ఓవర్‌ ఇవ్వడం. గతంలో పవన్‌, చిరంజీవితో కలిసి 'శంకర్‌ దాదా జిందాబాద్‌' సినిమాలో కన్పించాడు. తన సినిమాల్లో అప్పుడప్పుడూ అన్నయ్య చిరంజీవి రిఫరెన్స్‌లు తీసుకొస్తుంటాడు పవన్‌. మొత్తమ్మీద 'సైరా' సినిమాకి పవన్‌ వాయిస్‌ ఓవర్‌ నిజమైతే, అది సినిమాకి మరో హైలైట్‌ ఎలిమెంట్‌ అవుతుందన్నమాట.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS