గీత గోవిందం తాజా కలెక్షన్స్ ఇవే

By iQlikMovies - August 20, 2018 - 16:18 PM IST

మరిన్ని వార్తలు

విజయ్ దేవరకొండ-రష్మిక జంటగా నటించిన గీత గోవిందం సినిమా ఆగష్టు 15న విడుదలై విజయవంతంగా ప్రదర్శింపబడుతున్నది. ఇక ఈ సినిమాకి తొలిరోజు నుండే కలెక్షన్స్ వర్షం కురుస్తున్నది.

ఇప్పటివరకు అంటే తొలి 5రోజులకి ఈ చిత్రం సుమారు రూ 31 కోట్ల షేర్ సాధించడం విశేషం. అమెరికాలో ఈ చిత్రం ఇప్పటికే 1.5 మిలియన్ డాలర్ల మార్కు దాటి ఇంకొక రెండు మూడు రోజుల్లో 2 మిలియన్ డాలర్ల మార్కుని దాటుతుంది అని అంచనా వేస్తున్నారు.

ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా జోరు ఏ మాత్రం తగ్గడం లేదు, ఈ వారం కూడా పెద్ద సినిమాలు ఏవి విడుదలకాకపోతుండడం కూడా గీత గోవిందంకి కలిసొచ్చే అంశం అని చెప్పాలి.

చూద్దాం.. రాబోయే రోజుల్లో గీత గోవిందం ఇంకెన్ని కోట్లు కొల్లగొట్టనుందో మరి...

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS