టాక్ అఫ్ ది వీక్- గీత గోవిందం

By iQlikMovies - August 19, 2018 - 12:40 PM IST

మరిన్ని వార్తలు

ఒక రెండు మూడు వారాల నుండి తెలుగు సినీ ప్రేక్షకులకి మంచి చిత్రాల రూపంలో ప్రతివారం ఏదో ఒక మంచి సినిమా విడుదలవుతూనే ఉంది.

అందులో భాగంగా ఈ వారం విడుదలైన చిత్రం గీత గోవిందం. అర్జున్ రెడ్డి వంటి ఒక కల్ట్ సినిమా తరువాత విజయ్ నుండి వస్తున్న సినిమా కావడం దానికి తోడు ఈ సినిమాలోని “ఇంకేం కావాలె” పాట బ్లాక్ బస్టర్ అవ్వడం ఆ తరువాత సినిమా లీక్ అవ్వడం వంటివి కూడా ఈ సినిమా పైన అందరికి ఒక ఆసక్తి నెలకొనేలా చేశాయి.

వీటన్నిటి మధ్యలో విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకుల వద్ద మంచి మార్కులే వేయించుకుంది. ఇక ఈ చిత్ర విజయంలో అగ్రభాగం దర్శకుడు పరశురామ్ కే దక్కుతుంది. చిన్న పాయింట్ తీసుకుని దాని చుట్టూ ఆసక్తికరమైన సన్నివేశాలు అల్లడం, హాస్యాన్ని కథనంలో ఇరికించకుండా సన్నివేశాల్లోనే హాస్యాన్నిసృష్టించి సక్సెస్ కొట్టేశాడు ఈ దర్శకుడు.

ఇక గీత పాత్రలో రశ్మిక, గోవిందం పాత్రలో విజయ్ ఈ సినిమాని సమానంగా మోశారు అని చెప్పాలి. వీరి చక్కటి అభినయానికి తోడుగా మంచి సంగీతం, సంబాషణలు, తోడవ్వడంతో ఈ చిత్రం మంచి హిట్ టాక్ అందుకుని బాక్స్ ఆఫీస్ వద్ద ఈ వర్షాకాలంలో కలెక్షన్స్ వర్షం కురిపిస్తున్నది.

మొత్తానికి అర్జున్ రెడ్డి తరువాత ఒక మంచి హిట్ తో తనని తాను నిరూపించుకోగలిగాడు విజయ్. ఇక రష్మికకి ఈ సినిమా తెలుగులో మరిన్ని సినిమాలు తెచ్చిపెట్టడం ఖాయం. దర్శకుడు పరశురాంకి కెరీర్ లో ఒక గుర్తిండిపోయే మంచి విజయం ఇది.

ఇది ఈ వారం www.iQlikmovies.com టాక్ అఫ్ ది వీక్.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS