సామ్రాట్‌ని 'బ్ర‌ద‌ర్‌'లా చూడ‌లేదు!

By iQlikMovies - October 12, 2018 - 19:15 PM IST

మరిన్ని వార్తలు

బిగ్ బాస్ 2 సీజ‌న్ ముగిసింది. హౌస్‌లో జ‌రిగిన చాలా సంఘ‌ట‌న‌ల‌కు, అక్క‌డ మొలకెత్తిన చాలా సందేహాల‌కు, ప్ర‌శ్న‌ల‌కు ఇప్పుడు స‌మాధానం దొరికేస్తోంది. బిగ్ బాస్ 2 సీజ‌న్ పూర్తిగా ఫాలో అయిన వాళ్ల‌కు గీతా మాధురి - సామ్రాట్‌ల ఎపిసోడ్‌ని ప్ర‌త్యేకంగా గుర్తు చేయాల్సిన అవ‌స‌రం లేదు.  

వాళ్లిద్ద‌రి చ‌నువు..  చాలామందిలో సందేహాలు రేకెత్తించింది.  గీతా మాధురి ఓసంద‌ర్భంలో 'మ‌నం మాట్లాడుకోవాల్సిన అవ‌స‌రం లేదు. క‌ళ్ల‌లో క‌ళ్లు పెట్టి చూస్తే చాలు' అనేస‌రికి... వీరిద్ద‌రి వ్య‌వ‌హారం ఎటు పోతోందో అనిపించింది.  చివ‌రికి సామ్రాట్‌కి రాఖీ క‌ట్టి - ఈ గాసిప్పుల‌కు పుల్ స్టాప్ పెట్టే ప్ర‌య‌త్నం చేసినా - అవేం అంతగా ఫ‌లించ‌లేదు.

వీటిపై గీతా మాధురి స్పందించింది. ''నేను అమిత్ భ‌య్యా, రోల్ రైడాతోనూ చాలా టాస్క్‌లు ఆడాను. వాళ్ల‌తోనూ ఫ్రెండ్లీగానే ఉన్నాను. అప్పుడు రాని మాట‌లు సామ్రాట్‌తోనే ఎందుకు వ‌చ్చాయి? అయినా సామ్రాట్‌తో అలా ఉంటే త‌ప్పేంటి?  ఓ టాస్క్ ఆడుతున్న‌ప్పుడు క‌ళ్ల‌లో క‌ళ్లు పెట్టే మాట్లాడాలి. జుట్టుని, చెవుల్ని, ముక్కుని చూసి మాట్లాడ‌లేం క‌దా'' అంటూ గ‌ట్టిగానే కౌంట‌ర్ వేసింది.

గేమ్ షోలో అడుగుపెట్టిన‌ప్పుడు సామ్రాట్‌ని మీరు బ్ర‌ద‌ర్‌లానే భావించారా?  అనే ప్ర‌శ్న‌కు కూడా అంతే స్ప‌ష్టంగా స‌మాధానం ఇచ్చింది. తాను సామ్రాట్‌ని బ్ర‌ద‌ర్‌లా చూడ‌లేద‌ని, క‌జిన్స్‌తో తాను ఎలా ఉండేదో... సామ్రాట్‌తోనే అలానే ఉన్నాన‌ని, త‌న గురించి నందుకు అన్నీ తెలుసని, నందులాంటి రిలేషన్ కానిది ఏదైనా త‌న దృష్టిలో ఒక‌టేన‌ని స్ప‌ష్టం చేసింది గీతా మాధురి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS