కౌశ‌ల్ ఆర్మీ గురించి పెద‌వి విప్పిన గీతామాధురి

By iQlikMovies - October 12, 2018 - 15:12 PM IST

మరిన్ని వార్తలు

బిగ్ బాస్ 2 ఫైన‌ల్‌లో కౌశ‌ల్‌కి గ‌ట్టి పోటీ ఇచ్చింది గీతా మాధురి.  చివ‌రి వ‌ర‌కూ.. నువ్వా - నేనా??  అన్న‌ట్టుగానే పోటీ సాగింది. అయితే... టైటిల్‌ని కౌశ‌ల్ ఎగ‌రేసుకుని వెళ్లిపోయాడు.  

గీతా మాధురి - కౌశ‌ల్ మ‌ధ్య 'కౌశ‌ల్ ఆర్మీ' ఒక్క‌టే అడ్డుగా నిలిచింది. కౌశ‌ల్ ఆర్మీ వ‌ల్లే కౌశ‌ల్ గెలిచాడ‌న్న‌ది నిర్వివాద అంశం. కౌశ‌ల్ అభిమానులంతా ఓ గ్రూపుగా ఏర్ప‌డి.. కౌశ‌ల్‌ని గెలిపించుకోవ‌డానికి శ‌త‌విధాలా ప్ర‌య‌త్నించి స‌క్సెస్ అయ్యారు. ఈ కౌశ‌ల్ ఆర్మీ గురించి ఇప్పుడు గీతా మాధురి కూడా స్పందించింది.

కౌశ‌ల్ ఆర్మీ అనేది ఒక‌టుంద‌ని త‌న‌కు బిగ్ బాస్ హౌస్‌లో ఉన్న‌ప్పుడే తెలుస‌ని, ఆ విష‌యం కౌశ‌లే త‌న‌కు స్వ‌యంగా చెప్పాడ‌ని గీత అంటోంది. బిగ్ బాస్ హౌస్ బ‌య‌ట ఏం జ‌రుగుతోంద‌న్న విష‌యం.. లోప‌ల ఉన్నవాళ్ల‌కు తెలీదు. మ‌రి కౌశ‌ల్‌కి త‌న‌కంటూ ఓ ఆర్మీ ఉన్న సంగతి ఎలా తెలుసు...?  దీనికీ స‌మాధానం గీతానే చెప్పింది. 

పూజా రామ‌చంద్ర‌న్ వైల్డ్ కార్డ్ ఎంట్రీతో మ‌ధ్య‌లో బిగ్ బాస్‌హౌస్‌లో అడుగుపెట్టింది. అప్ప‌టికే కౌశ‌ల్ ఆర్మీ గ్రూపు ఒక‌టి ఉధృతంగా కౌశ‌ల్‌కి ప్ర‌చారం చేయ‌డం మొద‌లెట్టింది. పూజా వ‌ల్లే.. కౌశ‌ల్ ఆర్మీ సంగ‌తి కౌశ‌ల్‌కి తెలిసింద‌ని, 'నాకో గ్రూప్ ఉంది. కోట్ల‌లో లైక్స్ వ‌స్తున్నాయ‌ట‌' అని కౌశ‌ల్ త‌న‌కు ప‌దే ప‌దే చెప్పేవాడ‌ని, దాన్ని తాను లైట్ తీసుకున్నాన‌ని గీత అంటోంది.

''నాకు త‌క్కువ ఓట్లు ప‌డ్డాయి. కౌశ‌ల్‌కి ఎక్కువ ఓట్లు ప‌డ్డాయి. అంతే తేడా'' అంటూ ఈగెలుపుకి కార‌ణం ప‌రోక్షంగా కౌశ‌ల్ ఆర్మీనే అన్న సంగ‌తి చెప్ప‌క‌నే చెప్పింది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS