అన్ని చోట్ల నుండి మహానటి సినిమా చూసిన అందరి నుండి వినిపిస్తున్న ఏకైక మాట ఇది ఒక అద్బుత చిత్రం అని. అయితే ఈ చిత్రాన్ని విమర్శిస్తున్నవారు కూడా ఒకరు ఉన్నారు. వారే జెమిని గణేషన్ కూతురు కమలా సెల్వరాజ్.
పూర్తి వివరాల్లోకి వెళితే, మహానటి చిత్రం లో జెమిని గణేషన్ ని ఒక స్త్రీ లోలుడిగా అదే విధంగా సావిత్రికి మద్యం అలవాటు చేసిన వ్యక్తిగా చూపెట్టడం తమని చాలా బాధపెట్టింది అని జెమిని గణేషన్ కూతురు చెప్పింది. అయితే సినిమాలో చూపెట్టినట్టుగా సావిత్రి కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరు పట్టించుకోలేదు అన్నది అవాస్తవం అని, సావిత్రిని తన నిర్ణయాలు పునః సమీక్షించుకోవాలని తన తండ్రి కోరినప్పట్టికి ఆమె ఆ మాటని పట్టించుకోలేదు అని తెలిపింది.
అదే కాకుండా ఇంటి వాచ్ మెన్ తో తన తండ్రిని బయటికి పంపించేసినప్పుడు తాను తన తండ్రి తో ఉన్నాను అని చెప్పుకొచ్చింది. ఏదేమైనా సినిమాలో తన తండ్రి పాత్రని ఆవిష్కరించిన విధానం మాత్రం చాలా అభ్యంతరకరంగా ఉంది అంటూ చెప్పింది.
మహానటి చిత్రంలో జెమిని గణేషన్ పాత్రని ప్రముఖ నటుడు దుల్కర్ సల్మాన్ పోషించాడు.