ప్రముఖ రచయత-దర్శకుడు రాజసింహ ఈరోజు ఆత్మహత్యకి ప్రయత్నించినట్టుగా తెలుస్తున్నది.
అందుతున్న ప్రాధమిక వివరాల ప్రకారం, కెరీర్ లో సరైన హిట్ రాకపోవడంతో కొద్దిరోజుల నుండి తీవ్ర నిరాశకి లోనవుతున్నట్టుగా తెలుస్తున్నది. అందుకనే ఆత్మహత్య చేసుకోవాలని హై డోస్ నిద్రమాత్రలు వేసుకున్నాడట, ప్రస్తుతం ఆయనని ఆసుపత్రికి తరలించినట్టుగా సమాచారం.
ఈయన ఆఖరిగా దర్శకత్వం చేసిన చిత్రం ఒక అమ్మాయి తప్ప. ఈ చిత్రంలో సందీప్ కిషన్-నిత్యా మీనన్ లు జంటగా నటించారు, అయితే ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తాపడింది. దీనితో ఆయన ఇంకా ఒత్తిడికి లోనయ్యాడట.
సినిమాలలో సరైన బ్రేక్ కోసం ఎదురుచూస్తూ అది దక్కకపోవడంతో చాలా మంది ప్రముఖులు తమ తనువు చాలించడం చూసాము. దురదృష్టవశాత్తు రాజసింహ కూడా ఇలాంటి ప్రయత్నమే చేయడం విచారకరం.