బొమ్మరిల్లుతో తెలుగమ్మాయి అయిపోయింది జెనీలియా. ఆ తరవాత దాదాపు పెద్ద హీరోలందరితోనూ నటించింది. పెళ్లయ్యాక వెండి తెరకు దూరమైపోయింది. ఇప్పుడు మళ్లీ.. ఎంట్రీ ఇస్తోంది. గాలి జనార్థన్ రెడ్డి తనయుడు కిరీటీ హీరోగా ఓ సినిమా తెరకెక్కుతోంది. ఇందులో జెనీలియా లో కీలక పాత్ర పోషిస్తోంది. చాలా గ్యాప్ తరవాత జెనీలియా నటిస్తున్న సినిమా కావడంతో ఈ ప్రాజెక్ట్‌పై ఆసక్తి ఏర్పడింది. ఇప్పటి వరకూ ఎంతమంది అడిగినా, నటించడానికి నో చెప్పిన జెనీలియా ఈ పాత్ర ఎలా ఒప్పుకుంది? అని అంతా ఆశ్చర్యపోతున్నారు. దానికి ఓ కారణం ఉంది.
ఈ సినిమాలో జెనీలియా తప్ప వేరెవరూ చేయలేనటువంటి పాత్ర ఒకటి ఉందట. అందుకోసమే ఆమెను సంప్రదించాల్సివచ్చిందట. ఈ సినిమాలో నటించడానికి జెనీలియా కూడా ముందు ఒప్పుకోలేదట. కానీ నిర్మాత బ్లాంక్ చెక్ ఇవ్వడంతో జెనీ ఓకే చెప్పిందట. ఈ సినిమా కోసం జెనీలియా రూ.3 కోట్ల పారితోషికం తీసుకుందని సమాచారం. జెన్నీ హీరోయిన్ గా ఫామ్ లో ఉన్నప్పుడు కూడా 50 లక్షలు మించి తీసుకోలేదు. ఇప్పుడు టాప్ హీరోయిన్ల పారితోషికమే రూ.3 కోట్లు లేదు. అలాంటిది, ఈ వెటరన్ భామకు రూ.3 కోట్లు ఇచ్చారంటే గ్రేటే.