వరుణ్ తేజ్ 'గని ట్రైలర్ బయటికి వచ్చింది. ట్రైలర్ ని ఆసక్తికరంగా కట్ చేశారు. టీజర్ లో గని కేవలం బాక్సింగ్ నేపధ్యం వున్న సినిమాగా చూపించారు. కానీ ట్రైలర్ కి వచ్చేసరికి ఫ్యామిలీ యాంగిల్ ని కూడా టచ్ చేశారు. ట్రైలర్ లో కథని చాలా వరకూ రివిల్ చేశారు. జీవితంలో బాక్స్ ఆడకూడని కొడుకు దగ్గర మాట తీసుకున్న తల్లి, బాక్సింగ్ లో విన్నర్ అయిన తర్వాతే తను బాక్సర్ ని చెప్పాలనుకునే కొడుడు.. ఈ ప్రయాణం ఎలా సాగింది ? తల్లి మాటని గని ఎలా నిలబెట్టాడు ? అతనికున్న గతం ఏంటి ? నాన్నతో వున్న వైరం ఏమిటి ? అనే మిగతా కథ.
ట్రైలర్ లో బాక్సింగ్ రింగ్ సీన్లు గ్రాండ్ గా వున్నాయి. ఉపేంద్ర, సునీల్ శెట్టి, జగపతి బాబు, నవీన్ చంద్ర కీలక పాత్రల్లో కనిపించారు. తల్లి పాత్రలో నదియా కనిపించింది. వరుణ్ తేజ్ చాలా ఫిట్ గా కనిపించాడు. బాక్సర్ గని పాత్రలో ఒదిగిపోయాడు. గని చెప్పిన డైలాగులు కథపై ఆసక్తి పెంచాయి. 'లైఫ్ లో మంచోడిని గెలుకు చెడ్డోని గెలుకు, కానీ నాలా ఆటని గెలిపించాలనే పిచ్చోడిని మాత్రం గెలక్కు.'' డైలాగ్ క్యాచిగా వుంది. ట్రైలర్ చివర్లో పెద్ద కర్రదుంగని మెడపై నుంచి కిందపడేయడం, అక్కడ వరుణ్ తేజ్ యాటిట్యూడ్ మాస్ కి నచ్చేలా కట్ చేశారు. ఏప్రిల్ 8న సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుంది.