‘ఘరానామొగుడు’ మెగా మ్యాజిక్‌ ఎవరిది.?

మరిన్ని వార్తలు

28 ఏళ్ళ క్రితం వచ్చిన ఓ తెలుగు సినిమా.. తెలుగునాట సరికొత్త రికార్డుల్ని సృష్టించింది. తెలుగు సినిమా స్టామినాని పెంచింది. ఆ సినిమానే ‘ఘరానామొగుడు’. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు తెరకెక్కించిన ఈ సినిమాలో మెగాస్టార్‌ చిరంజీవి సరసన నగ్మా, వాణి విశ్వనాథ్‌ హీరోయిన్లుగా నటించారు. దేవి ఫిలింస్‌ పతాకంపై నిర్మాత దేవీ వరప్రసాద్‌ ఈ చిత్రాన్ని నిర్మించారు. అప్పటికీ, ఇప్పటికీ, ఎప్పటికీ ఎవర్‌ గ్రీన్‌ సినిమా ‘ఘరానామొగుడు’. ఆ సినిమాలోని పాటలు ఇప్పటికీ ట్రెండీగా అనిపిస్తాయి. ఆ సినిమాలో మెగాస్టార్‌ చిరంజీవి డాన్సులు.. ఇప్పటికీ వెరీ వెరీ స్పెషల్‌. నగ్మా, వాణి విశ్వనాథ్‌.. ఈ ఇద్దరి అందాల ఆరబోత, అంతకు మించి మెగాస్టార్‌ చిరంజీవితో కెమిస్ట్రీ.. ఇవన్నీ ‘ఘరానామొగుడు’ ప్రత్యేకతలు.

 

ఫుల్‌ఫ్లెడ్జ్‌డ్‌ కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌ ‘ఘరానామొగుడు’. ఈ ట్రెండ్‌కి తగ్గట్టుగా రీమేక్‌ చేయగలిగితే.. మరోసారి ‘ఘరానామొగుడు’ మ్యాజిక్‌ రిపీట్‌ అవుతుంది. కానీ, ఆ సాహసం చేసేవారెవరు.? ఆ సంగతి పక్కన పెడితే, 28 ఏళ్ళ క్రితం ‘ఘరానామొగుడు’ సంచలన విజయాన్ని అందుకున్న దరిమిలా, ఆనాటి జ్ఞాపకాల్ని గుర్తు చేసుకుంటూ, మెగాస్టార్‌ చిరంజీవిని ప్రశంసల్లో ముంచెత్తేశారు దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు సోషల్‌ మీడియా వేదికగా. అయితే, ఆ ‘మెగా’ క్రెడిట్‌ అంతా దర్శకుడిదేనని చిరంజీవి చెప్పడం గమనార్హం. కీరవాణి మ్యూజిక్‌, దేవివరప్రసాద్‌ నిర్మాణపు విలువలు.. ఇవన్నీ ఆ సినిమాని ఉన్నత స్థానంలో నిలబెట్టాయన్నారు చిరంజీవి. ‘మమ్మల్ని పువ్వుల్లో పెట్టి చూసుకున్నారు.. పళ్ళల్లో పెట్టి కూడా చేసుకున్నారు..’ అంటూ చిరంజీవి తనదైన స్టయిల్లో ఛమక్కులు విసిరారు రాఘవేంద్రరావు మీద.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS