హీరో అవుతానంటే... నాగార్జున తిట్టారు!

మరిన్ని వార్తలు

ఒక్క ఐడియానే కాదు, ఒక్కోసారి ఒక్క స‌ల‌హా కూడా ఒక‌రి జీవితాన్ని మార్చేస్తుంది. అయితే అది ఆ స‌ల‌హా ఇచ్చేవారిని బ‌ట్టి, తీసుకునేవారిని బ‌ట్టి కూడా ఆధార‌ప‌డి ఉంటుంది. యాంక‌ర్‌గా ఇప్పుడు మంచి పేరు తెచ్చుకున్న ర‌వికి కూడా ఒక‌రి స‌ల‌హా చాలా ఉప‌యోగ‌ప‌డింది. జీవితం ట‌ర్న్ అయిపోయేంత‌గా స‌హాయ‌ప‌డింది. ఆ స‌ల‌హా ఇచ్చింది ఎవ‌రో కాదు.. కింగ్ నాగార్జున‌.

 

నిజానికి యాంక‌ర్ ర‌వికి సైన్యంలో చేరాల‌ని ఉండేద‌ట‌. నేష‌న‌ల్ డిఫెన్స్ అకాడ‌మీలో కొంత‌కాలం శిక్ష‌ణ కూడా తీసుకున్నాడు. కానీ అక్క‌డి ప‌ద్ధ‌తులు న‌చ్చ‌క ఇంటికొచ్చేశాడు. ఆ త‌ర‌వాత డాన్స్ మాస్ట‌ర్‌గా అవ‌తారం ఎత్తాడు. సెల‌బ్రెటీల‌కు డాన్స్ క్లాసులు తీసుకునేవాడ‌ట‌. అలానే నాగార్జున‌, అమ‌ల‌తో ప‌రిచ‌యం అయ్యింది. ఓసారి ఫంక్ష‌న్‌లో `నువ్వు ఏమ‌వుదామ‌నుకుంటున్నావు` అని ర‌విని నాగ్ అడిగార‌ట‌. `నేను హీరో అవుదామ‌నుకుంటున్నా` అన్నాడ‌ట ర‌వి. హీరో అవ్వ‌డం అంత సుల‌భం కాదు, అని నాగార్జున క్లాసు పీకి, బాగా త‌ట్టి.. `నువ్వు యాంక‌ర్ అయితే బాగుంటుంది` అని ఓ ఛాన‌ల్ హెడ్‌ని క‌ల‌వ‌మ‌ని చెప్పార్ట‌. దాంతో ర‌వి యాంక‌రింగ్ వైపు రావాల్సివ‌చ్చింది. ఇప్పుడు టాలీవుడ్ లోనే పేరెన్న‌ద‌గిన యాంక‌ర్ అయ్యాడు. ఒక‌ట్రెండు సినిమాల్లోనూ న‌టించి హీరో అవ్వాల‌న్న క‌ల నేర‌వేర్చుకున్నాడు. అదీ.. హీరో అవ్వాల‌నుకున్న యాంక‌ర్ ర‌వి ఫ్లాష్ బ్యాక్‌.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS