ఫిట్‌నెస్ కా బాప్ దిశా పటానీ అని అనడంలో అతిశయోక్తి అస్సలు లేదని చెప్పొచ్చు. ఎందుకంటే ఫిట్‌నెస్‌లో పక్కా ప్లానింగ్‌తో ఉంటుంది ముద్దుగుమ్మ దిశాపటానీ. తాజా ఫోటో చూస్తే, అమో ఏమి కండలు దిశా అనిపించక మానదు. అలాగే సెక్స్ అప్పీల్ కూడా ఎక్కడా మిస్ కావట్లేదు.
ప్రస్తుతం దిశాపటానీ 'సంఘమిత్ర' సినిమాలో నటిస్తోంది. పీరియాడిక్ నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రం కోసం దిశా పటానీ కత్తి యుద్ధాలు, గుర్రపు స్వారీలు చేయాల్సి వస్తుంది. అందుకే తన అసలు సిసలు నాజూకు శరీరానికి మరింతగా మెరుగులు దిద్ది ఇదిగో ఇలా స్లీకీగా మారిపోయింది. హైటుకు తగ్గ పర్సనాలిటీ, పర్సనాలిటీకి తగ్గ గ్లామర్, అందానికి అందం, క్యూట్‌నెస్‌కి క్యూట్‌నెస్ అన్నీ కలగలిపి రూపు దిద్దుకున్న వయ్యారమే దిశాపటానీ.
అందుకే ఆమె అందానికి అంతటి ప్రత్యేకత. ఈ గ్లామర్‌తోనే హాలీవుడ్ హీరో జాకీచాన్‌ని సైతం మెస్మరైజ్ చేసింది. 'కుంగ్‌ఫూ యోగా' చిత్రంలో జాకీచాన్‌తో కలిసి యాక్షన్ సీన్స్ ఇరగదీసింది. హిందీలో కండల వీరుడు టైగర్ ష్రాఫ్‌తో 'బాఘీ' చిత్రంలోనూ యాక్షన్ దుమ్ము దులిపేసింది. దటీజ్ దిశాపటానీ.