అందాల ఆరబోతే కాదు, డిఫరెంట్ డిఫరెంట్ స్టంట్స్ చేయడంలోనూ అందాల ఆదా శర్మ టాప్ ప్లేస్‌లో ఉంటుంది. రకరకాల ఫిట్నెస్ స్టంట్స్‌లో ఆరి తేరిన ఆదా శర్మ ప్రస్తుతం ఓ బ్యూటిఫుల్ ఫీట్ చేసింది చూశారా.? ఆమె ఫీట్ కి మైమర్చిన భూమి రివర్స్ అయిపోయిందా.? అన్నట్లుంది ఈ స్టిల్. ఇలాంటి స్టిల్స్‌లో కూడా కెమెరాకి పోజివ్వచ్చన్న ఐడియా కేవలం ఆదాశర్మ వంటి వారికే వస్తుందేమో బహుశా.
ఇక స్టిల్ విషయానికి వస్తే, గ్రీనిష్ బ్లూ కలర్ ట్రాక్ ప్యాంట్ ధరించి నేలపై చేతులు ఆనించి కాళ్లను గోడకు తన్నిపెట్టింది. ఇందులో ఏమంత వింత ఉందంటారా.? ఒక్క చేతి పైనే బాడీని బ్యాలెన్స్ చేసింది. సైడ్ వాల్కి 90 డిగ్రీల కోణంలో కాళ్లని ఆనించింది. ట్రై చేసి చూడండి. ఇది సింపుల్ ఫీటా.? లేక టఫ్ ఫీటా.? అని మీకే అర్ధమవుతుంది. ఇలాంటి ఫీట్ చేసి కూడా ఫేస్‌లో ఆ స్వీట్ స్మైల్ మిస్ చేయలేదు ఈ మిస్ చూశారా.? దటీజ్ ఆదాశర్మ.