సినిమా కష్టాలంటే ఇవే: హీరోలున్నారు హీరోయిన్సే లేరు..!

మరిన్ని వార్తలు

‘పింక్‌’ రీమేక్‌తో పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చారు. ఆల్రెడీ ‘ఖైదీ’తో సెకండ్‌ ఇన్నింగ్స్‌ స్టార్ట్‌ చేసిన చిరంజీవి వరుస సినిమాలతో యాక్టివ్‌గా ఉన్నారు. ఇక విక్టరీ వెంకటేష్‌, నాగార్జున, బాలయ్య తదితర సీనియర్‌ హీరోలంతా ఫుల్‌ స్వింగ్‌లో ఉన్నారు. కానీ, వీరికి హీరోయిన్స్‌ దొరకడమే కష్టంగా మారింది. బాలయ్య 106 వ చిత్రం కోసం హీరోయిన్‌ వేట కొనసాగుతూనే ఉంది. చిరంజీవి కోసం సీనియర్‌ హీరోయిన్‌ త్రిష సెట్టయినా, పవన్‌ కళ్యాణ్‌ ‘పింక్‌’లో మెయిన్‌ లీడ్‌ హీరోయిన్‌ ఇంకా కన్‌ఫామ్‌ కాలేదు. వీరే కాదు, ఈ మధ్య చరణ్‌, ఎన్టీఆర్‌ మల్టీ స్టారర్‌ ప్రాజెక్ట్‌ ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ హీరోయిన్‌ కోసం ఎంతగా వెతుకులాట సాగిందో తెలిసిన సంగతే. తిప్పి కొడితే, రష్మికా మండన్నా, పూజా హెగ్దే తప్ప మరో హీరోయిన్‌ కనిపించడం లేదు టాలీవుడ్‌లో.

 

మహేష్‌, ప్రబాస్‌ తదితర హీరోలకు సంబంధించిన కొత్త ప్రాజెక్ట్స్‌ లైన్‌లోకొస్తున్నాయి. కానీ, వీరి సరసన నటించే ముద్దుగుమ్మలెవరనే విషయంపై ఉత్కంఠ పెరిగిపోతోంది. ఇదిలా ఉంటే, పవన్‌ కళ్యాణ్‌ ప్రస్తుతం ఒక్కటి కాదు, రెండు కాదు, ఏకంగా ఐదారు ప్రాజెక్టు లైన్‌లో పెట్టేశారు. మరి ఆయా సినిమాల్లో పవన్‌తో జత కట్టే ముద్దుగుమ్మలెవరంటా.? బాలీవుడ్‌ నుండి అరువు తెచ్చుకోవాలా.? లేక టాలీవుడ్‌లో ఉన్న ఒకరిద్దరితోనే సరిపెట్టుకొని బోర్‌ కొట్టించుకోవాలా.? ఇవన్నీ కాదంటే, కొత్త భామలకు దశ తిరిగే మంచి సమయమేమైనా ఆసన్నమైందా.? వేచి చూడాలిక.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS