టాలీవుడ్లో ప్రస్తుతం రష్మికా మండన్నా హవా నడుస్తోంది. వరుస ఆఫర్స్‌తో ఫుల్ జోష్‌గా నడుస్తోంది రష్మిక కెరీర్. మొన్నీమధ్యనే ‘సరిలేరు..’తో సూపర్ హిట్ కొట్టింది. ఇప్పుడు మరో హిట్‌కి రెడీ అవుతోంది. నితిన్‌తో రష్మిక నటించిన ‘భీష్మ’ చిత్రం వచ్చే వారం రిలీజ్‌కి ముస్తాబవుతోంది. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్స్ వేగవంతంగా సాగుతున్నాయి. ఈ ప్రమోషన్స్‌లో రష్మిక తన మ్యానరిజమ్స్‌తో, క్యూట్ క్యూట్ ముచ్చట్లతో ఫ్యాన్స్‌ని ఆకట్టుకుంటోంది. తన పర్సనల్ ముచ్చట్లు ఫ్యాన్స్‌తో పంచుకుంటూ అల్లరల్లరి చేస్తోంది. తాజా ప్రమోషన్స్‌లో భాగంగా, స్పెషల్ ఫోటో షూట్లోనూ పాల్గొంది రష్మిక.
ఈ ఫోటోస్‌లో కొంటెతనం కలబోసిన రకుల్ గ్లామర్‌కి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. రష్మిక చిలిపి చేష్టలు చిత్ర యూనిట్లో హుషారు నింపుతున్నాయి. సినిమాపై పాజిటివ్ వైబ్స్ క్రియేట్ చేస్తున్నాయి. వైట్ అండ్ వైట్ మోడ్రన్ డ్రస్ ధరించి నడుంపై చేతులు పెట్టుకుని, నాలుక బయట పెట్టి, కొంటెగా కన్ను గీటుతున్న రష్మిక ఫోటోకి బోలెడన్ని లైకులూ షేర్లూ వచ్చేస్తున్నాయి. క్యూట్‌గా బుట్ట చేతులతో డిజైన్ చేసిన ఈ డ్రస్‌లో రష్మిక భలే క్యూట్‌గా కనిపిస్తుందిలే. డీప్ నెక్ టాప్ కావడంతో, చిన్నగా క్లీవేజ్ షో కూడా జరుగుతూ హాట్‌గానూ రష్మిక కవ్విస్తోంది మరి.