ఫిట్నెస్ విషయంలో ఎప్పుడూ పర్ఫెక్ట్గా ఉండే రకుల్ ఫుడ్ విషయంలో మాత్రం ఎలాంటి పరిమితులు పెట్టుకోనని గతంలో బోలెడన్ని సార్లు చెప్పింది. నచ్చిన ఫుడ్ తీసుకోవడం, తర్వాత ఫిట్‌గా ఉండేందుకు కసరత్తులు చేయడం చేసే రకుల్ వ్యాయామాన్ని తన లైఫ్ స్టైల్లో రెగ్యులర్ చేసేసుకుంది. ప్రతీ రోజూ ఉదయం గానీ, సాయంత్రం కానీ యోగా ఖచ్చితంగా చేస్తానని చెబుతుంది. అలాగే, ఫుడ్‌కీ, ఫిట్నెస్కీ అస్సలు సంబంధం లేదని ఫిట్నెస్ పాఠాలు కూడా బాగానే చెబుతూ వుంటుంది. తన మెనూలో ఎక్కువగా నాన్‌వెజ్ ఉండేలా చూసుకునే రకుల్ సడెన్‌గా వెజిటేరియన్‌గా మారిపోయిందట. ఎందుకు? అంటే అందుకు పెద్దగా కారణాలు లేవంటూ సింపుల్‌గా తేల్చేసింది .
విదేశాలకు వెళ్లినప్పుడు మాత్రం ఫుడ్ విషయంలో ఎప్పుడూ కొంచెం కష్టమే అని చెబుతోంది రకుల్. ప్రస్తుతం హిందీ, తెలుగు సినిమాలతో బిజీగా ఉన్న రకుల్, తెలుగులో నితిన్ హీరోగా ‘చదరంగం’ సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది. చంద్రశేఖర్ ఏలేటి ఈ సినిమాకి దర్శకుడు. ప్రియా ప్రకాష్ వారియర్ ఈ మూవీలో మరో హీరోయిన్గా నటిస్తోంది. అలాగే హిందీలో రెండు ఫిలింస్‌లో నటిస్తోంది. ఒకప్పుడు టాలీవుడ్లో స్టార్ హీరోయిన్ అనిపించుకున్న రకుల్‌కి ఇప్పుడు ఆ స్థానం లేదనే చెప్పాలి. కానీ, అరా కొర ఛాన్సెస్తో అలా అలా నడిపించేస్తోంది. కోలీవుడ్‌లోనూ రకుల్ తీరు ఇలాగే ఉంది. సౌత్‌లో పరిస్థితి ఇలా ఉంటే, బాలీవుడ్లో రకుల్ కెరీర్ కాస్త బెటర్‌గా ఉందనే చెప్పాలి. సో బాలీవుడ్లోనే తన స్థానం పదిపరచుకునే దిశగా రకుల్ ప్రయత్నాలు సాగుతున్నాయి.