ఆమె వెండితెరపై సెక్సప్పీల్‌కి కేరాఫ్ అడ్రస్. బాలీవుడ్‌లోనే కాదు, టాలీవుడ్‌లోనూ ఐటమ్ సాంగ్‌తో దుమ్ము రేపేసింది. ఆ భామ ఎవరో కాదు, ఈషా గుప్తా. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన ‘వినయ విధేయ రామ’ సినిమాలో ‘ఏక్ బార్.. ఏక్ బార్..’ అంటూ రామ్ చరణ్‌తో స్టెప్పులేసిన ఐటమ్ బాంబ్ గుర్తుంది కదా.? ఆ ఐటమ్ బాంబే ఈ ఈషా గుప్తా. ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా లాక్ డౌన్ సిట్యుయేషన్‌తో ఇంటికే పరిమితమైపోవాల్సి వచ్చింది సెలబ్రిటీలు.
ఈషా గుప్తా ఇందుకు మినహాయింపేమీ కాదు. ఇంట్లో వుంటే మాత్రం, హాట్ అప్పీల్ తగ్గుతుందా.? ఛాన్సే లేదంటూ ఇదిగో ఇలాంటి పోజులతో సోసల్ మీడియాని హీటెక్కించేస్తోంది. ఏమాటకామాటే చెప్పుకోవాలి.. ఇందులో సెక్సప్పీల్‌తోపాటు, అద్భుతమైన యోగాసనం కూడా కన్పిస్తోంది కదూ.! బహుశా ఈ యోగానే ఈ భామ నాజూకుతనానికి కారణమేమో.! ఇటు యోగాపై అవగాహన, ఇంకోపక్క సెక్సప్పీల్.. రెండూ కలిపి అదరగొట్టేస్తోందన్నమాట ఈషా గుప్తా.