తమిళ హీరో అజిత్ ఓ మల్టీస్టారర్‌కి శ్రీకారం చుట్టబోతున్నాడట. ఓ ప్రముఖ తమిళ దర్శకుడు ఈ మేరకు కథ సిద్ధం చేశాడనీ, అయితే అది మల్టీస్టారర్ అనీ ప్రచారం జరుగుతోంది. సౌత్‌లో మంచి పాపులారిటీ వున్న ఓ టాలీవుడ్ స్టార్ హీరో ఈ సినిమాలో నటించబోతున్నాడట. సౌత్ నుంచి మరో మల్టీస్టారర్ అజిత్ నుంచి రాబోతోందన్న ప్రచారంతో అతని అభిమానుల్లో కొత్త ఉత్సాహం కన్పిస్తోంది. అజిత్‌కి కోలీవుడ్‌లో విపరీతమైన ఫాలోయింగ్ వున్నా, ఎందుకో తెలుగులో స్టార్‌డమ్ సంపాదించుకోలేకపోయాడు. ఈసారి మాత్రం, పక్కాగా టాలీవుడ్ బాక్సాఫీస్ మీద కూడా ఫోకస్ పెట్టాడట అజిత్.
సౌత్ సినిమా మార్కెట్ రేంజ్ పెరగడం, బాలీవుడ్ స్థాయికి అది ఎదగడం.. మొత్తంగా పాన్ ఇండియా సినిమాల జోరు ఇప్పుడు పెరగడంతో అజిత్ తనంతట తానుగా మల్టీస్టారర్ నిర్ణయం తీసుకున్నాడని తెలుస్తోంది. అయితే, అజిత్ సరసన నటించబోయే ఆ తెలుగు స్టార్ హీరో ఎవరన్నదానిపై కొంత సస్పెన్స్ కొనసాగుతోంది. నిజానికి, గత ఏడాది చివర్లోనే ఈ ప్రాజెక్ట్‌పై కీలక చర్చలు జరిగాయట. ఈ ఏడాది సమ్మర్‌లో ఈ ప్రాజెక్ట్‌పై క్లారిటీ ఇవ్వాలనే ఆలోచన చేసినా, లాక్‌డౌన్ నేపథ్యంలో ఆ ఆలోచనలకు తాత్కాలికంగా బ్రేక్ పడిందని అంటున్నారు. టాలీవుడ్‌లో ఓ ప్రముఖ ప్రొడ్యూసర్, కోలీవుడ్‌లో ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించే అవకాశాలున్నాయట.