స్టార్ హీరోయిన్‌గా సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా, స్పెషల్ ఫోటో షూట్స్‌తోనూ ఆకట్టుకుంటూ, ఫ్యాన్స్‌ని మెస్మరైజ్ చేయాలనుకుంటుంది ముద్దుగుమ్మ పూజా హెగ్దే.
ఈ ఏడాది 'మహర్షి' సినిమాతో ఓ హిట్ అందుకుంది. తర్వాత 'గద్దలకొండ గణేష్'లో తన అందంతో అతిలోక సుందరి శ్రీదేవినే మైమరిపించింది. హిందీలో 'హౌస్ ఫుల్ 4' సినిమాతో సూపర్ హిట్ కొట్టింది. సినిమాల సంగతి ఎలా ఉన్నా, ప్రమోషన్స్ పేరు చెప్పి, పూజా హెగ్దే చేసిన గ్లామర్ హల్‌చల్ అంతా ఇంతా కాదు. ఇవన్నీ ఒకెత్తు అయితే, మరోవైపు సోషల్ మీడియా వేదికగా హాట్ ఫోటో షూట్స్ మరో ఎత్తు. బికినీ షోలతో పిచ్చ లేపేసిన పూజా హెగ్దే, తాజాగా ఓ మ్యాగజైన్ కవర్ పేజ్ కోసం ట్రెడిషనల్ చోలీలో తళుక్కున మెరిసింది.
ట్రెడిషనల్ అయినా, అన్‌లిమిటెడ్ హాట్‌నెస్‌తో కిర్రాకు పుట్టించింది. స్పైసీ లుక్స్‌తో పిచ్చెక్కించేసింది. చెమ్కీలు పొదిగిన ఆరెంజ్ కలర్ స్లీవ్‌లెస్ చోలీ టాప్ ధరించి, స్లైల్‌గా చేతులు కట్టుకుని నిలబడింది. చేతులకు నిండుగా గాజులు ధరించింది. మెడలో ధరించిన నక్లెస్ పూజా అందాన్ని రెట్టింపు చేసేలా ఉంది. ఎగిరే నీలాల కురులు ముఖాన్ని దాచేస్తుంటే రొమాంటిక్ ఫీల్ కలుగుతోంది. ఇక ఆ క్లీవేజ్ సొగసులు పాపం కుర్రోళ్లకు మతులు పోగొట్టేస్తూ, మత్తులోకి నెట్టేస్తున్నాయంతే.