లాక్మే ఫ్యాషన్ షోలో అందాల భామలు తమ తమ గ్లామర్‌తో కేక పుట్టించారు. హాట్ హాట్‌గా మెరిసిపోతూ, ర్యాంప్‌పై తళుక్కుమన్నారు. ఈ ఎపిసోడ్లో గోవా బ్యూటీ ఇలియానా కూడా తనదైన స్టైల్లో హుషారుగా గ్లామర్ షో చేసింది. వైలెట్ కలర్ చెమ్కీ థ్రెడ్‌తో డిజైన్ చేసిన గాగ్రా చోళీ ధరించి ర్యాంప్‌పై మెరుపులు మెరిపించింది. అరతా బాగానే ఉంది కానీ, స్లిమ్ అండ్ స్లీకీ పర్సనాలిటీకి కేరాఫ్ అడ్రస్ అయిన ఇలియానాకి ఎందుకో ఈ షో బెడిసికొట్టినట్లయ్యింది. అహో అందమా.. ఒహో అందమా అని మిగిలిన తారల్ని నెటిజన్లు తెగ పొగిడేస్తే, పాపం ఇలియానాని మాత్రం ట్రోల్ చేస్తున్నారు. అందుకు కారణం ఇలియానా పర్సనాలిటీనే.
బెల్లీ బ్యూటీగా పాపులర్ అయిన ఇలియానా ఈ షోలో తన ఫిగర్‌ని మిస్ అయ్యిందే అంటూ నెటిజన్స్ ట్రోల్ చేస్తున్నారు. అనవసరమైన చోట పెరిగి, అవసరమైన చోట పిసరంత కండ లేదే.. అంటూ ఇలియానాని విమర్శిస్తున్నారు ప్రియమైన నెటిజన్లు. నిజమే ఈ మధ్య ఇలియానా కాస్త బొద్దుగా మారిన సంగతి తెలిసిందే. బొద్దుగా ముద్దుగా ఉన్న ఇలియానానే ఫ్యాన్స్ తట్టుకోలేకపోయారు. అలాంటిది అసలు చెప్పుకోదగ్గ ఫిగర్ లేనట్లు కనిపిస్తున్న ఇలియానాని ఇలా చూసి ఫ్యాన్స్ అస్సలు భరించలేకపోతున్నారు. ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా వెలుగులు విరజిమ్మిన ఇలియానాకి ఇప్పుడు ఏదీ కలిసి రావడం లేదు. ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ సినిమాతో టాలీవుడ్‌కి రీ ఎంట్రీ ఇచ్చినా, వర్కవుట్ కాలేదు. తర్వాత మరో ఛాన్స్ రాలేదు ఇలియానాకి. అందుకే ఏదోలా లైమ్ లైట్లో ఉండాలనే ఇదిగో ఇలాంటి గ్లామర్ షోస్‌లో మెరిసిపోవాలనుకుంటోంది కాబోలు ఇలియానా.