రత్తాలుగా టాలీవుడ్‌కి సెన్సేషనల్ అయిన ముద్దుగుమ్మ లక్ష్మీరాయ్ తాజాగా ఓ పార్టీ వేర్‌లో దర్శనమిచ్చింది. వైట్ కలర్ కాస్ట్యూమ్‌లో రాయ్ సైడ్ యాంగిల్ వ్యూ ఒకటి నెట్టింట్లో హల్‌చల్ చేస్తోంది. పార్టీ వేర్ కదా.. తళుకు బెళుకులతో జిగేల్ రాణిలా మెరిసిపోతోంది. చెవులకు మ్యాటీ ఫినిష్డ్ స్టోన్ టాప్స్ ధరించింది. పార్టీ లైటింగ్‌లో అవి జిగేల్ కాంతులీనుతున్నాయి. పింక్ కలర్ లిప్‌స్టిక్ ఆమె ముఖారవిందాన్ని మరింత మెరిసిపోయేలా చేస్తోంది. డిఫరెంట్ హెయిర్ స్టైల్‌లో సమ్‌థింగ్ డిఫరెంట్ లుక్స్‌లో కనిపిస్తోంది లక్ష్మీరాయ్. బ్యాక్ గ్రౌండ్‌లో లైట్ ఎఫెక్ట్‌కి ఆమె గ్లామర్ మరింత మురిపిస్తోంది.
ఇక లక్ష్మీ రాయ్ ఫ్యూచర్ ప్రాజెక్టుల విషయానికి వస్తే, తెలుగులో ‘ఆనంద భైరవి’ అను ఓ చిత్రంలో నటిస్తోంది. అలాగే, తమిళంలో రెండు ప్రాజెక్టుల్లో నటిస్తోంది. వచ్చిన ప్రతీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ కెరీర్‌ని పర్‌ఫెక్ట్‌గా బిల్డ్ చేసుకుంటోంది. అలాగే కొన్ని వెబ్ సిరీస్‌పైనా లక్ష్మీరాయ్ ఈ మధ్య దృష్టి పెట్టింది. ఎంత బిజీ షెడ్యూల్స్ ఉన్నప్పటికీ, సోషల్ మీడియాలో తన ఫాలోవర్స్ కోసం హాట్ హాట్ పిక్స్ పోస్ట్ చేయడంలో ఎప్పుడూ ముందుంటుంది హాట్ అండ్ సెక్సీ లక్ష్మీ రాయ్.