గ్లామ్‌షాట్‌: మెగా డాటర్‌ ఏంటీ గ్లామర్‌ విపరీతం.?

మరిన్ని వార్తలు

మెగా ఫ్యామిలీ నుండి వచ్చిన మొట్ట మొదటి హీరోయిన్‌గా నిహారిక, ‘ఒక మనసు’ సినిమాతో కూల్‌ రొమాంటిక్‌ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. హీరోయిన్‌గా పెద్దగా సక్సెస్‌ కాలేకపోయింది. ఆ తర్వాత ‘హ్యాపీ వెడ్డింగ్‌’, ‘సూర్యకాంతం’ తదితర చిత్రాల్లో నటించింది కానీ, స్టార్‌డమ్‌ దక్కించుకోలేకపోయింది. ప్రస్తుతం వెబ్‌ సిరీస్‌పై దృష్టి పెట్టింది. చాలా వెబ్‌ సిరీస్‌లో నటించింది. అంతా బాగానే ఉంది కానీ, సడెన్‌గా ఏమైందో ఏమో కానీ, నిహారిక గ్లామర్‌ అవతారమెత్తింది. బాలీవుడ్‌ హీరోయిన్స్‌ని తలదన్నేలా ఓ హాట్‌ ఫోటో సెషన్‌ చేయించుకుని, ఆ ఫోటోల్ని నెట్టింట్లో వదిలింది. మోకాలి పై వరకూ ఉన్న వైట్‌ అండ్‌ షార్ట్‌ ఫ్రాక్‌ ధరించి మత్తు మత్తుగా ఫోటోలకు పోజిచ్చింది.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

It’s all messy, The hair The heart The words Life. 🌏

A post shared by Niharika Konidela (@niharikakonidela) on

ఈ పిక్స్‌ చూసి మెగా ఫ్యాన్స్‌, నిజంగానే ఈ పిక్స్‌లో ఉన్నది నిహారికయేనా.? అన్నంతలా ఆశ్చర్యపోతున్నారు. నిజమే, మోకాలి పై వరకూ ఉన్న ఆ ఫ్రాక్‌లో నిహారిక థై సౌందర్యం చూస్తుంటే, అచ్చు బాలీవుడ్‌ హాట్‌ భామలే గుర్తొస్తారు మరి. అసలింతకీ ఇంత హాట్‌ లుక్స్‌లోకి నిహారిక ఎందుకు మారిపోయిందో ఏమో కానీ, మెగా డాటర్‌ అనే ఇమేజ్‌ పక్కన పెట్టేస్తే, నిహారికలో ఓ మంచి బాలీవుడ్‌ హాట్‌ యాక్ట్రెస్‌ కనిపిస్తోంది. ఏమో నిహారిక హాట్‌ ఎంట్రీ వెనుక ఉద్దేశ్యం కూడా అదేనేమో.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS