రొమాన్సే కాదు, యాక్షన్‌కీ సై అంటోన్న బ్రాండ్‌ బ్యూటీ.!

మరిన్ని వార్తలు

సోషల్‌ మీడియాలో ఇన్నర్‌ వేర్‌ బ్రాండ్స్‌తో పాపులర్‌ అయిన ముద్దుగుమ్మ దిశా పటానీ, ప్రస్తుతం బాలీవుడ్‌లో క్రేజీయెస్ట్‌ ఆఫర్స్‌ దక్కించుకుంటూ దూసుకెళుతోంది. లేటెస్ట్‌గా ‘మలంగ్‌’ సినిమాలో హాట్‌ హాట్‌ పర్‌ఫామెన్స్‌ ఇచ్చి కవ్వించిన దిశా, ప్రస్తుతం కండలవీరుడు సల్మాన్‌ ఖాన్‌తో ‘రాధే’ మూవీలో ఆన్‌ స్క్రీన్‌ రొమాన్స్‌ చేస్తోంది. అయితే, ఇన్‌ ఫ్యూచర్‌ ఎలాంటి సినిమాలు చేయానుందని దిశా పటానీని అడగ్గా, దిమ్మ తిరిగే కోరికను బయట పెట్టింది. హాట్‌ యాంగిల్స్‌లో కనిపించి, కనిపించి బోర్‌ కొట్టేసింది. ఇకపై వీర లెవల్లో యాక్షన్‌ చేయానుందని సమాధానమిచ్చింది. అంటే యాక్షన్‌ సినిమాల్లో నటించానుందన్న తన కోరికను దిశా చెప్పకనే చెప్పిందన్న మాట.

 

అయితే, స్కిన్‌ షోకి బాగా అవాటు పడిపోయిన ఆడియన్స్‌ అమ్మడి యాక్షన్‌ని రిసీవ్‌ చేసుకుంటారా.? అంత తక్కువగా తీసి పారేయకండి. అందాల భామలు యాక్షన్‌ చేసినా, గ్లామర్‌ మిస్‌ కారన్న సంగతి మర్చిపోతున్నారు మీరు. సో అక్కడ కూడా స్కిన్‌ షోకి ఏమాత్రం ఢోకా ఉండదనే అనుకోవాలి. ఇకపోతే, ఈ పోరి తెలుగులో ‘లోఫర్‌’ సినిమాలో నటించింది. ‘లోఫర్‌’లోనూ కావల్సినంత అంగాంగ ప్రదర్శన చేసినా సినిమా హిట్‌ కాకపోవడంతో, అందాల ప్రదర్శన హైలైట్‌ కాలేదు సరికదా.. తర్వాత మరో ఛాన్స్‌ కూడా రాకపోవడంతో, టాలీవుడ్‌ ఆడియన్స్‌కి దిశా సోషల్‌ మీడియా సెన్సేషన్‌గానే గుర్తుండిపోయింది. మరి, బాలీవుడ్‌లోనైనా కోరుకున్న క్రేజీ ఆఫర్స్‌ దక్కించుకుని కూల్‌గా సెటిల యిపోతుందా.? అనేది వేచి చూడాలి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS