అందాల భామ పాయల్ రాజ్‌పుత్ అంటే ‘ఆర్ఎక్స్100’ బోల్డ్ మూవీ గుర్తొచ్చినా, అప్పియరెన్స్‌లో మాత్రం ఆమె ఆటిట్యూడ్‌ని ఎవ్వరూ మర్చిపోలేరు. తొలి సినిమాతోనే బోల్డ్ ఇమేజ్‌ని దక్కించుకున్న ఈ ముద్దుగుమ్మకు సోషల్ మీడియాలో అపారమైన ఫాలోయింగ్ దక్కింది. ఆ ఫాలోయింగ్‌ని జాగ్రత్తగా కాపాడుకునేందుకు అప్పుడప్పుడూ తనదైన శైలిలో గ్లామర్ పిక్స్ పోస్ట్ చేస్తుంటుంది పాయల్‌రాజ్‌పుత్. తాజాగా పాయల్ పోస్ట్ చేసిన ఓ వైట్ అండ్ వైట్ మోడ్రన్ వేర్ పిక్ ఇప్పుడందరి దృష్టినీ విశేషంగా ఆకర్షిస్తోంది. సోఫాలో కూర్చొని పొయెటిగ్గా పోజు పెట్టి ఏదో ఆలోచిస్తున్నట్లు కనిపిస్తున్న పాయల్ అంద చందాలు చూపరుల్ని కట్టిపడేస్తున్నాయి.
అందమైన హెయిర్ స్టైల్‌తో చెక్కిన శిల్పంలా కనిపిస్తోంది. లైట్‌గా క్లీవేజ్ అందాలు కనువిందు చేస్తున్నా, పాయల్ అందమైన మోమే కళ్ల ముందు సందడి చేస్తోంది. వైట్ కలర్ డ్రస్‌కి తగ్గట్లుగా ఒంటిపై ధరించిన ఆభరణాలన్నీ వజ్రాలు పొదిగినవే కావడంతో పాయల్ అందం జిల్ జిల్ జిగేల్మనిపిస్తుంది. ఆకాశంలోని తారలన్నీ కట్ట కట్టుకుని వచ్చి పాయల్ ఒంటిపై మెరుస్తున్నాయా.? అన్నంతలా ఈ దృశ్యం ఆవిష్కృతమైంది. ఇంకెందుకాస్యం ఈ అపురూప దృశ్యంలో అందమైన అజంతా బొమ్మని మీరూ వీక్షించండి.