చక్కనమ్మ చిక్కినా, బొద్దుగున్నా అందమేనంటారు అందాన్ని ఆరాధించేటోళ్ళు. అందాల భామ రాశి ఖన్నా కూడా అంతే. బొద్దుగా వున్నా, కాస్త సన్నబడినా.. ఆమె అందం పెరుగుతుందే తప్ప తగ్గదు. ఆ సంగతి పక్కన పెడితే, తక్కువ టైమ్ లోనే ఎక్కువ సినిమాలు చేసేసిందీ భామ. అయినా, స్టార్ హీరోయిన్ అన్పించుకోవడానికి ఇంకా తంటాలు పడాల్సి వస్తోంది.
‘వెంకీ మామ’, ‘ప్రతి రోజూ పండగే’ సినిమాలతో మంచి జోరు మీదున్న రాశి ఖన్నా, ముందు ముందు స్టార్ హీరోయిన్ల రేసులో దూసుకుపోతానంటోంది. ఈ క్రమంలోనే తన గ్లామర్‌కి ఇంకాస్త పదును పెడుతున్నట్లుంది. కలర్‌ఫుల్ బ్లేజర్.. దాంట్లోంచి తొంగి చూస్తోన్న అందాలు.. వెరసి, ‘వాస్తు’ అదుర్స్.. అనేలా వుంది కదూ రాశి ఖన్నా.
ALSO SEE :
Raashi Khanna Latest Photoshoot