‘పిట్ట పిటపిటలాడిపోతోంది..’ అంటూ ‘సోగ్గాడే చిన్నినాయనా’ సినిమాలో లావణ్య త్రిపాఠిని కొందరు ఆకతాయిలు ఏడిపిస్తే, దానికి మీనింగ్ ఏంటా.? అని గూగుల్ ఇట్ చేస్తాను.. అని నాగ్ గూగుల్‌లో సెర్చ్ చేసినట్లు మీరూ చేయకండి. ఎందుకంటే మాకు తెలుసు, మీకు ఆ మీనింగ్ తెలుసని. ఇకపోతే, ఇప్పుడీ టాపిక్ ఎందుకంటారా.? ఈ పిక్ చూస్తున్నారుగా.. ఇందులో పిటపిటలాడే ఈ గ్లామర్ పిట్టని గుర్తు పట్టారా.? ‘పైసా’ మూవీలో నానితో కలిసి బికినీలో అరేబియా నయగారంలా తెగ వయ్యారాలు పోయింది కదా.. ఆ భామే ఈ భామ.
సిద్ధిఖా శర్మ. అప్పుడప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఈ బ్యూటీ లేటెస్ట్గా పోస్ట్ చేసిన ఈ ఫోటో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది. సాలిడ్ గ్లామర్‌తో బికినీకి కాస్త ఎక్కువ అనేలా ఉన్న ఈ మేఘాల రంగు డ్రస్‌లో నిజంగానే సిద్దిఖా పిటపిటలాడిపోతోందిలే. ‘పైసా’ మూవీ తర్వాత ఈ పాప ఎక్కడా కనిపించలేదు కానీ, ప్రస్తుతం అమన్‌తో ఓ సినిమాలో నటిస్తోంది. రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్ ప్రీత్ హీరోగా డెబ్యూ చేస్తున్న ‘నిన్నే పెళ్లాడతా’ సినిమాలో అమన్‌తో జత కడుతోంది అందాల సిద్దిఖా శర్మ.