బాలీవుడ్ హీరో అజయ్ దేవగణ్‌తో రకుల్ ‘దే దే ప్యార్ దే’ సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో టబు కూడా వన్ ఆఫ్ ది హీరోయిన్‌గా నటించింది. పెళ్లయిన వ్యక్తికి ప్రియురాలి పాత్రలో నటించింది రకుల్ ఈ సినిమాలో. అయితే, ఆశించిన స్థాయిలో ఆ సినిమా రకుల్‌కి పేరు తెచ్చిపెట్టలేకపోయింది. కానీ, తాజాగా అందుతోన్న సమాచారం ప్రకారం అజయ్ దేవగణ్‌తో రకుల్ మరోసారి ఛాన్స్ దక్కించుకుందని తెలుస్తోంది.
ఈ సారి సోలో హీరోయిన్‌గా రకుల్ నటించనుందట. సినిమా పేరు, వివరాలు ప్రస్తుతానికి తెలియవు కానీ, త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడి కానున్నాయి. దీంతో పాటు, మరో రెండు హిందీ ప్రాజెక్టులు రకుల్ ఖాతాలో పడేందుకు చర్చల దశలో ఉన్నట్లు తాజా సమాచారం. ఇకపోతే, టాలీవుడ్‌లోనూ ఇప్పుడిప్పుడే రకుల్ పుంజుకుంటోంది. ‘మన్మధుడు 2’లో నాగ్‌కి జోడీగా నటించిన రకుల్, ప్రస్తుతం నితిన్ హీరోగా ఓ సినిమాలో నటిస్తోంది. చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి ‘చదరంగం’ అనే టైటిల్ పరిశీలిస్తున్నారు. ప్రియా ప్రకాష్ వారియర్ ఈ సినిమాలో మరో హీరోయిన్‌గా నటిస్తోంది.