RRR మూవీ తరవాత రామ్ చరణ్ , ఎన్టీఆర్ క్రేజ్ పీక్స్ కి వెళ్ళింది. భాషా బేధాలు కూడా పోయాయి. సౌత్, నార్త్ అని ఆలోచించకుండా యాక్టర్స్ ని ఆదరిస్తున్నారు. ఎన్టీఆర్ బాలీవుడ్ లోవార్ 2 తో డైరక్ట్ ఎంట్రీ ఇస్తున్నాడు. దీంతో మెగా ఫాన్స్ కూడా చెర్రీ ఎప్పుడు బాలీవుడ్ లోకి ఎంటర్ అవుతాడా అని చూస్తున్నారు. 2013 లో 'జన్జీర్' మూవీతో ప్రియాంక చోప్రా తో కలిసి నటించాడు. కానీ అప్పుడు చరణ్ చిరు వారసుడిగా ఎంట్రీ ఇచ్చాడు. కానీ ఇప్పుడు గ్లోబల్ స్టార్ గా మళ్ళీ బాలీవుడ్ లో అడుగుపెట్టాలని ఫాన్స్ వెయిట్ చేస్తున్నారు.
ఇలాంటి టైమ్ లో మెగా ఫాన్స్ కి పండగ లాంటి వార్త ఒకటి బయటికి వచ్చింది. షారుఖ్, చరణ్ కాంబినేషన్ లో ధూమ్ 4 ప్రాజెక్ట్ ప్రచారం ఊపందుకుంది. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఈ వార్తే. యశ్ రాజ్ ఫిల్మ్స్ ఇప్పటికే ధూమ్ ఫ్రాంఛైజీలో త్రీ సిరీస్ చేయగా అన్నీ హిట్ అయ్యాయి. ఇప్పటివరకు ఈ సిరీస్ లో జాన్ అబ్రహం, హృతిక్ రోషన్, ఆమిర్ ఖాన్ లాంటి స్టార్స్ విలన్ల పాత్రలు పోషించగా, అభిషేక్ బచ్చన్ పోలీస్ పాత్రలో కనిపించాడు.
ఇప్పుడు ధూమ్ 4 లో మరో హీరో కోసం వెతుకుతున్న నేపథ్యంలో చెర్రీ అయితే ఎలా ఉంటుందన్న చర్చ సోషల్ మీడియాలో మొదలైంది. విలన్ పాత్రలో షారుఖ్ లుక్ ఎలా ఉంటుందో కూడా ఊహించి ఫొటోలు క్రియేట్ చేసేస్తున్నారు ఫాన్స్. షారుఖ్, చెర్రీ కాంబోలో ధూమ్ 4 వస్తే మాత్రం రికార్డులన్నీ బద్దలవ్వడం ఖాయం.