గాడ్ ఫాదర్ రిజల్ట్ చిత్ర విచిత్రంగా తయారైంది. తొలి రోజు ఈ సినిమాని సూపర్ హిట్ అన్నారు. ఆ తరవాత ఏవరేజ్ స్థాయికి తీసుకొచ్చారు. ఇప్పుడు ఫైనల్ రన్ లో... కలక్షన్లు చూశాక.. `ఫ్లాప్`గా నిర్దారించేశారు. ఈనెల 5న భారీ అంచనాలతో రిలీజ్ అయిన గాడ్ ఫాదర్ మొత్తానికి రూ.55 కోట్లు సాధించింది. పెట్టిన పెట్టుబడికీ, వచ్చిన రాబడికీ లెక్కలు బేరీజు వేస్తే ట్రేడ్ పండితులు ఈ సినిమాని ఫ్లాప్ కిందే జమ కట్టారు. చాలా ఏరియాల్లో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వలేదు. బయ్యర్లు స్వల్పంగా నష్టపోవాల్సివచ్చింది.
నైజాం లో దాదాపుగా 11 కోట్లు రాబట్టింది గాడ్ ఫాదర్. సీడెడ్ లో 10 కోట్లు వచ్చాయి. ఉత్తరాంధ్రలో 6 కోట్లు, గుంటూరు లో 4 కోట్లు సంపాదించింది. ఓవర్సీస్‌లో రూ.6 కోట్ల వరకూ వచ్చాయి. తొలి రోజు వసూళ్లు బాగానే ఉన్నా, రెండో రోజు.. మూడో రోజు వసూళ్లు బాగా డల్ అయిపోయాయి. వచ్చిన హిట్ టాక్‌ని ఈ సినిమాని నిలబెట్టుకోలేకపోయిందనే చెప్పాలి. అయితే... నిర్మాత మాత్రం సేఫ్ జోన్‌లోపడిపోయాడని టాక్. ఓటీటీ, శాటిలైట్ రైట్స్ నిర్మాతల్ని గట్టెక్కించాయి. ఆచార్యతో పోలిస్తే బయ్యర్లు భారీగా నష్టపోలేదు. ఆ మేరకు గాడ్ ఫాదర్ కొంచెం బెటరే అని చెప్పాలి.